Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రి నిర్వాకం : 75 రోజులుగా మార్చురిలోనే కరోనా రోగి మృతదేహం.. ఎందుకంటే..

ఉత్తర్ ప్రదేశ్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రూ. 15వేల  ఆస్పత్రి బిల్లు కట్టలేదని కోవిడ్ రోగి మృతదేహాన్ని రెండున్నర నెలలుగా హాస్పిటల్ మార్చురిలోనే ఉంచిన దారుణ ఘటన జరిగింది. 

Body of Covid Patient Lays in Mortuary For More Than 75 Days in Meerut - bsb
Author
Hyderabad, First Published Jul 5, 2021, 11:31 AM IST

ఉత్తర్ ప్రదేశ్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రూ. 15వేల  ఆస్పత్రి బిల్లు కట్టలేదని కోవిడ్ రోగి మృతదేహాన్ని రెండున్నర నెలలుగా హాస్పిటల్ మార్చురిలోనే ఉంచిన దారుణ ఘటన జరిగింది. 

యూపీలోని మీరట్ లోని లాలా లాజ్ పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ (ఎల్ఎల్ఆర్ఎంసి)లో కోవిడ్ బాధిుతుడి మృతదేహం 75 రోజులకు పైగా మార్చురీలో పడి ఉన్నట్లు గుర్తించారు. 

నరేష్ అనే వ్యక్తి కరోనాతో ఏప్పిట్ 15వ తేదీన మరణించాడు. మృతదేహం కోసం అతని భార్య గుడియా ఆస్పత్రికి వస్తే రూ. 15 వేలు చెల్లించాలని వైద్యులు కోరారు. తన వద్ద రూ. 15 వేలు లేక చెల్లించలేదు. దీంతో వారు తన భర్త మృతదేహాన్ని 75 రోజుల పాటు మార్చురీలోనే ఉంచారని గుడియా ఆరోపించారు.

ఈ ఘటన మీద తాము దర్యాప్తుకు ఆదేశించామని మీరట్ జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కాగా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదని ఆస్పత్రి అధికారులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios