ఈ క్రమంలో హెడ్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.


ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, బ్లూటూత్స్ వాడని వారంటూ ఎవరూ ఉండరేమో. వీటిని వాడటం ఈ కాలం యూత్ కి ఫ్యాషన్ అయిపోయింది. అయితే.. ఇవే తాజాగా ఓ బాలుడి ప్రాణం తీసింది.

బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ సహాయంతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా పేలడంతో 15 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. జైపూర్‌లోని చోము ప్రాంతంలోని ఉదయ్‌పురియా గ్రామానికి చెందిన రాకేశ్‌ నగర్‌ తన బ్లూటూత్‌ హెడ్‌ఫోన్‌ను వినియోగించి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో హెడ్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రుండ్లా మాట్లాడుతూ బాలుడు గుండెపోటుతో మరణించాడన్నారు. బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ పేలి చనిపోవడం దేశంలో ఇదే మొదటిసారి కావొచ్చని అని అధికారులు పేర్కొన్నారు. బహుశా పేలుడు సంభవించిన సమయంలో రెండు చెవులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలి బాలుడు చనిపోయాడనే విషయం ఇప్పుడు అందరినీ షాకింగ్ కి గురిచేస్తోంది. చాలా మంది ఇప్పుడు వాటిని వాడాలంటే భయడిపోతుండటం గమనార్హం.