వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారుల జీవితాన్ని అగాధంలో పడేసింది. రక్తం ఎక్కించే ముందు సరైన పరీక్షలు చేయకపోవడంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకింది. ఇందులో ఒక బాలుడు చనిపోయారు. వీరంతా తలసేమియా వ్యాధిగ్రస్తులు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తలసేమియాతో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు రక్తం ఎక్కించిన తర్వాత వారు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలారు. ఇందులో ఒక పిల్లవాడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. నలుగురు చిన్నారులు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించామని, వారిలో ఒకరు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే ధాకటే తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
‘‘ఈ ఘటనలో ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ (FDA) ప్రాథమిక దర్యాప్తును కూడా ప్రారంభించింది. అయితే చికిత్స సమయంలో పిల్లలకు పరీక్షలు నిర్వహించగా హెచ్‌ఐవీ సోకింది. బ్లడ్ బ్యాంక్ ద్వారా కలుషిత రక్తాన్ని అందించడంతో వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌బీ సోకినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తలసేమియా రోగులకు అందించిన రక్తాన్ని ముందుగా న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్ (NAT)తో పరీక్షించాల్సి ఉంటుంది. అయితే బ్లడ్ బ్యాంక్‌లో ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలు హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారు ” అని డాక్టర్ విక్కీ రుగ్వానీ చెప్పారు. కాగా గతంలో కూడా ఇలాగే రక్తమార్పిడి ద్వారా ఐదుగురు తలసేమియా పిల్లల ద్వారా హెపటైటిస్ సీ సోకింది, ఇద్దరు పిల్లలు హెపటైటిస్ బీ బారిన పడ్డారు. అయితే ఈ తాజాగా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాహుల్ గాంధీ మంత్రి కాదు.. బ్రిటన్ పర్యటన కోసం రాజకీయ అనుమతి అవసరం లేదు - కాంగ్రెస్
తలసేమియా అంటే ఏమిటి ?
తలసేమియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఇది తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు సంక్రమిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ తలసేమియా వాహకాలు అయితే, ఆ బిడ్డకు తలసేమియా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వల్ల రక్తం సరిగ్గా ఏర్పడదు. ఎందుకంటే హిమోగ్లోబిన్‌ను తయారు చేసే జన్యు సంకేతంలో కొంత సమస్య వల్ల ఇది జరుగుతుంది.
ప్రతీ సంవత్సరం మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి తల్లిదండ్రుల నుండి తరానికి తరానికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కలిగిన పిల్లలకు పదే పదే రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తికి హిమోగ్లోబిన్ సరిగా ఉండదు. అందు వల్ల బయటి నుంచి ఆ వ్యక్తి రక్తాన్ని స్వీకరించాల్సి ఉంటుంది.
బీజేపీ కాదు.. కాంగ్రెస్-ఎన్సీపీలే మాకు అసలైన శత్రువులు - శివసేన నాయకుడు వికాస్ గోగవాలే
తలసేమియా అనేది ఒక నిరంతర రక్త వ్యాధి. దీని కారణంగా రోగిలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ ఏర్పడదు. తలసేమియా వ్యాధి ఉన్న వ్యక్తి తరచూ జలుబుకు గురవుతారు. అలాగే ఎప్పుడూ ఆనారోగ్యంతో ఉండే అవకాశం ఉంటుంది. పలువురిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరంలో బలహీనత, నొప్పి ఉంటుంది. అంతే కాకుండా దంతాల నుంచి రక్తం బయటకు రావడం, వయస్సును బట్టి శారీరక ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అలాగే శరీరం పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
