బెంగుళూరులోని న్యూ తారగ్ పేటలో గురువారం నాడు పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బెంగుళూరు: కర్ణాటక (karnataka)రాష్ట్రంలోని బెంగుళూరులోని(banglore) న్యూ తారగ్ పేటలో(New Taragupet ) గురువారం నాడు పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.కెఆర్ మార్కెట్ (kr market) సమీపంలోని న్యూ తారగ్ పేటలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

న్యూ తారగ్ పేటలోని భవనంలో పేలుడు చోటు చేసుకొంది. గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనంలోని నాలుగో అంతస్థులో పేలుడు చోటు చేసుకొంది. ఈ భవనంలోని సీ, బీ బ్లాక్ లోని పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. 

బ్లాస్ట్ జరిగిన భవనానికి సమీపంలోనే స్కూల్ ఉంది. అయితే ప్రస్తుతం స్కూల్ కు సెలవులు ఇచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ ప్రమాదం నాలుగో అంతస్థులో చోటు చేసుకొంది. అయితే మంటలు ఇతర గదులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు అధికారులు.