కోల్‌కత్తా: జైలు అధికారులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేవైఎం నేత ప్రియాంక శర్మ ఆరోపించారు.

బుధవారం నాడు జైలు నుండి విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. జైలు అధికారులు తనతో ఎవరూ కూడ మాట్లాడకుండా అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ కార్యకర్తను కాబట్టే తనను టార్గెట్ చేశారని ఆమె విమర్శించారు.

బెంగాల్ సీఎంపై ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టినందుకు తాను క్షమాపణ చెప్పబోనని ఆమె స్పష్టం చేశారు. తనతో బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. బెంగాల్ జైల్లో కనీస సౌకర్యాలు కూడ లేవని ఆమె చెప్పారు.