కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి బీజేపీని ద్రవిడ నేల పై నుంచి పంపించారని చెప్పారు.
చెన్నై: కాంగ్రెస్ విజయంతో ద్రవిడ నేలపై బీజేపీ గుడిచిపెట్టుకుపోయిందని, 2024 లోక్ సభ ఎన్నికల్లో భావ సారూప్య పార్టీలు చేతులు కలపాలని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శనివారం అన్నారు. కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టాప్ లీడర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్దారామయ్య, డీకే శివకుమార్‌లకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వారితో ఫోన్‌లో మాట్లాడారు.
ద్రవిడ కుటుంబాలు నివసించే నేల బీజేపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చేసిందని, వారి భూమిలో నుంచి బీజేపీని పంపించారని ఎంకే స్టాలిన్ ఓ సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం అందరం కలిసి పని చేయాలని, తద్వారా ప్రజాస్వామ్యం, దేశంలోని రాజ్యాంగ విలువలను కాపాడటం వీలవుతుందని అన్నారు.
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచి బ్రదర్ రాహుల్ గాంధీ ఎంపీ పోస్టును తొలగించారని, రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగించిందని స్టాలిన్ తెలిపారు. హిందీ భాష రుద్దడం, విచ్చలవిడి అవినీతి, ప్రత్యర్థుల పై ప్రతీకార ధోరణి వంటి దుశ్చర్యలను కన్నడిగుల గుర్తించారని పేర్కొన్నారు. ప్రతీకార రాజకీయాలు చేసే బీజేపీకి కన్నడిగులు గట్టి సమా ధానాన్ని ఇచ్చా రని వివరించారు.
