Asianet News TeluguAsianet News Telugu

Amravati Murder : అమరావ‌తి ఫార్మ‌సిస్టు హ‌త్య‌కు వ్య‌తిరేకంగా శాంతియుత నిర‌స‌న చేప‌ట్ట‌నున్న బీజేపీ

అమరావతిలో వెలుగులోకి వచ్చిన ఫార్మసిస్టు హత్యకు వ్యతిరేకిస్తూ బీజేపీ శాంతియుత నిరసన చేపట్టాలని భావిస్తోంది. తాము శాంతియుతంగానే నిరసలు తెలుపుతామని, పోలీసులు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ కోరింది.  

BJP to start peaceful protest against Amravati Pharmacist's murder -  Shivaray Kulkarni
Author
Mumbai, First Published Jul 3, 2022, 4:50 PM IST

గత నెలలో మహారాష్ట్రలోని అమరావతిలో జ‌రిగిన వెట‌ర్న‌రీ ఫార్మ‌సిస్టు హత్యకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత శివరాయ్ కులకర్ణి ఆదివారం మీడియాతో వెల్ల‌డించారు. ‘‘ శాంతియుతంగా నిరసనలు జరపాలని బీజేపీ కోరుకుంటోంది. తమ పార్టీ హింసాత్మక పార్టీ కానందున పోలీసులు ఈ నిర‌స‌న‌కు అనుమతి నిరాకరిస్తారని మేము భావించడం లేదు. గత 15 రోజులుగా మేము ఎప్పుడూ, ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయలేదు. అలాంటిది చేయకూడదని కోరుకుంటున్నాము. ఘటనలు పునరావృతం అవుతున్నాయి’’ అని ఆయన అన్నారు. 

తెలంగాణలో ప్రజల కష్టాలు పెరిగాయి.. టీఆర్ఎస్ నుంచి అవినీతి నేర్చుకోవాలా?: కేంద్ర మంత్రులు ఫైర్

కొంత కాలం కిందట ఓ టీవీ చ‌ర్చ‌లో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఇవి దేశమంతా దుమారాన్ని రేపాయి. ప్ర‌పంచ‌లోని అనేక గ‌ల్ప్ దేశాలు కూగా ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించాయి. ఆయా దేశాల్లో ఉంటున్న భార‌త రాయభారుల‌ను పిలిపించుకొని వివ‌ర‌ణ అడిగాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. ఇవి హింసాత్మ‌కంగా మారాయి. త‌రువాత ఈ ఆందోళ‌న‌లు కొంత చ‌ల్ల‌బ‌డ్డాయి. అయితే ఇటీవ‌ల రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో క‌న్హ‌య్య లాల్ అనే టైల‌ర్ నుపూర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దీంతో అత‌డిని దారుణంగా హ‌త్య చేశారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కూడా విడుద‌ల చేశారు.ఇస్లాంను అవ‌మానించినందుకు ఇలా చేశామ‌ని అందులో పేర్కొన్నారు. 

బాల్ ఠాక్రే సిద్ధాంతాలను శివసేన-బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది - సీఎం ఏక్ నాథ్ షిండే

ఈ ఘ‌ట‌నను దేశం మ‌ర‌వ‌క ముందే మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తిలో మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. వెటర్న‌రీ ఫార్మ‌సిస్టుగా ప‌ని చేసే ఉమేష్ కోల్హే హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆయ‌న కూడా అంత‌కు ముందు నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతోనే అత‌డిని చంపేశార‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఏడుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇర్ఫాన్ ఖాన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఇద్దరు లష్కర్ టెర్రరిస్టులను పట్టుకున్న గ్రామస్తులు.. పోలీసులకు అప్పగింత.. ఊరి ప్రజలకు రూ. 5 లక్షల రివార్డు

అమ‌రావ‌తి హ‌త్య ఘ‌ట‌న‌పై శ‌నివారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) స్పందించింది. ఈ కేసులో ద‌ర్యాప్తు చేయాల్సిందిగా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (NIA)ని ఆదేశించింది. దీంతో  ఎన్ఐఏ బృందం స‌భ్యులు మ‌హారాష్ట్ర‌కు చేరుకున్నారు. విచార‌ణ ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై అమ‌రావ‌తి ఎంపీ నవనీత్ రాణా కూడా మీడియాతో మాట్లాడారు. ఈ హ‌త్య జ‌రిగిన వెంట‌నే తాను పోలీసుల‌ను సంప్ర‌దించాన‌ని తెలిపారు. అయితే వారు ఇది దోపిడీ స‌మ‌యంలో జ‌రిగిన హ‌త్య‌గా క‌నిపిస్తోంద‌ని త‌నతో చెప్పార‌ని అన్నారు. దీంతో తాము బాధిత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడ‌మ‌ని అన్నారు. మృతుడికి ఎవ‌రితో గొడ‌వ‌లు లేవ‌ని తెలుకున్నామ‌ని అన్నారు. ఇది దోపిడీ స‌మ‌యంలో జ‌రిగింది కాద‌నీ, ఒక వేళ అదే అయితే నిందితులు ఏమీ తీసుకెళ్ల‌లేద‌ని చెప్పారు. దీంతో తాము ఎన్ ఐఏకు, కేంద్ర హోం మంత్రికి లేఖ రాశామ‌ని, త‌రువాత విచారణ ప్రారంభ‌మైంద‌ని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios