న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ వ్యాఖ్యానించిన బీజేపీ అధికార ప్రతినిధి అనిల్  సౌమిత్రాను పార్టీ నుండి  సస్పెండ్ చేశారు.

సోషల్ మీడియాలో మహాత్మాగాంధీని ఫారద్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ అనిల్  పోస్ట్  చేశారు. అనిల్ సౌమిత్రాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించారు.ఈ విషయమై మధ్యప్రదేశ్  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ సింగ్ విచారణ జరపనున్నారు. 

బీజేపీ నాయకత్వం ఈ విషయమై అనిల్‌ను వివరణ ఇవ్వాలని కోరారు. ఏడు రోజుల్లో  ఈ విషయమై వివరణ ఇవ్వాలని  ఆయన ఆదేశించారు.మరో వైపు బీజేపీ నేత ప్రజ్ఞా'సింగ్ ఠాకూర్ నాథూరామ్ గాడ్సే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథూరామ్ గాడ్సే  దేశ భక్తుడు అంటూ సాద్వీ వ్యాఖ్యానించారు.