ఆదీవాసీలనుద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎస్టీ మోర్చా తీవ్రంగా తప్పు బట్టింది.
న్యూఢిల్లీ: ఆదీవాసీలనుద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎస్టీ మోర్చా తీవ్రంగా తప్పు బట్టింది.ఆదీవాసీలు ఎలా స్మార్ట్ పర్సన్ అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చట్ట సభలోనే ప్రసంగించారు. జార్ఖండ్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆదీవాసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం వెల్లడౌతుందని బీజేపీ గిరిజన మోర్చా నేతలు విమర్శలు చేశారు. చట్టసభల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ గిరిజన మోర్చా ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
జార్ఖండ్ కు చెందిన అన్సారీ నిత్యం మీడియాలో నిలుస్తారు. అసెంబ్లీ వేదికగా బీజేపీపై విమర్శలు చేస్తూ అన్సారీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా దోహదపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
