Asianet News TeluguAsianet News Telugu

సత్యేందర్ కా దర్బార్ .. ఢిల్లీ మంత్రి మరో వీడియో వైరల్.. 

దేశ రాజధాని ఢిల్లిలోని తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)నేత, మంత్రి సత్యేందర్ జైన్‌కు ఆ జైలు సూపరింటెండెంట్ రాచ మర్యాదలు చేశారని, అతని ఓ వీవీఐపీ గా ట్రీట్ చేశాడని  బిజెపి శనివారం మరో కొత్త వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

BJP releases video of Tihar jail official meeting Delhi minister
Author
First Published Nov 26, 2022, 12:01 PM IST

మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో సీసీటీవీ ఫుటేజీ తెరపైకి వచ్చింది. ఈ వీడియోను బీజేపీ విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.  ఈ వీడియోలో తీహార్ జైలులో అనేక తీవ్రమైన ఆరోపణలపై సస్పెన్షన్‌లో ఉన్న అప్పటి జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్.. సత్యేందర్ జైన్‌ను కలవడానికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సీసీటీవీ ఫుటేజీ సెప్టెంబర్ 12 నాటిది. జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సెల్‌లో ఉన్న సత్యేందర్ జైన్‌తో మాట్లాడటం చూడవచ్చు. సత్యేందర్ జైన్‌ని కలవడానికి వచ్చిన అజిత్ కుమార్ సెల్‌లోని కుర్చీలో కూర్చుని సత్యేందర్ జైన్‌తో మాట్లాడుతున్నాడు. సత్యేందర్ జైన్‌కు వీఐపీ సౌకర్యాలు కల్పించినందుకు అజిత్ కుమార్‌ను ఈ నెల ప్రారంభంలో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే..
  
వైరల్ వీడియో..ఆప్ పై కాంగ్రెస్-బీజేపీ విమర్శల దాడి  

మరోవైపు తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియో బయటకు రావడంతో దేశ రాజధాని రాజకీయాలు వేడేక్కాయి. ఆప్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ..ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకుని.. విమర్శలు గుప్పస్తోంది.  ఆయనకు బయటి నుంచి పండ్లు, ఆహార పదార్థాలు తీసుకొచ్చినట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో.. సత్యేందర్ జైన్ సెల్ లోపల బయటి ఆహారాన్ని తింటున్నాడు. ఇది కాకుండా మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్, సత్యేందర్ జైన్ నుండి భారీ మొత్తంలో పోలీసులు డబ్బు తీసుకున్నట్లు ఆరోపించాయి.

"తీహార్ జైలులో అధికార నేతలను ఎలా ట్రీట్ చేస్తారో అర్థమవుతోంది. ఈ సారి సత్యేందర్ కా దర్బార్ జైలు సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశారు," అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జై హింద్ ట్వీట్‌లో తెలిపారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైలులో ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు లీక్ అయిన వీడియోలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

ఇటీవలి రోజుల్లో జైలులో ఉన్న మంత్రి కూరగాయలు, పండ్లు తింటున్నట్లు తాజా వీడియోలో  వెలువడిన విషయం తెలిసిందే. తన మత విశ్వాసాల ప్రకారం తనకు పచ్చి ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ సిటీ కోర్టును ఆశ్రయించిన కొద్ది రోజుల తర్వాత ఈ వీడియోలు బయటపడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ మంత్రి సెల్ లోపల జైలు ఖైదీ నుండి మసాజ్ చేయించుకుంటున్న వీడియోలలో కనిపించిన కొద్ది రోజుల తర్వాత తాజా వీడియో బయటపడింది .మసాజ్ చేస్తున్న వ్యక్తి అత్యాచార నిందితుడని బిజెపి పేర్కొంది.

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్‌కు తీహార్ జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆరోపించింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఆధారాలను ఆర్థిక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్‌ఏ) కేసులో సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మే 30న అరెస్టు చేయడం గమనార్హం. అప్పటి నుంచి జైన్ తీహార్ జైల్లోనే ఉన్నాడు. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios