పాట్నా: రాష్ట్రంలో సుమారు 19 లక్షల మందికి ఉద్యోగాలతో పాటు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలో వచ్చే మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

తమ పార్టీ మిత్రపక్షమైన నితీష్ కుమార్ వచ్చే ఐదేళ్లపాటు సీఎంగా  ఉంటారని బీజేపీ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:బీహార్‌లో ఎన్నికలు: సభలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై చెప్పులు

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప్ పత్ర లో 19 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించింది.అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయమై పరిశోధనలు సాగుతున్నాయి.

బీజేపీ మేనిఫెస్టోలో విషయాలు

19 లక్షల ఉద్యోగాలు
కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తాం
రాష్ట్రంలో 3 లక్షల కొత్త టీచర్ల అపాయింట్ మెంట్లు
బీహార్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దడం, 10 లక్షల ఉద్యోగాల కల్పన
మహిళలు తమ కాళ్లమీద నిలబడేలా తీర్చిదిద్దుతాం.. కోటి మంది మహిళలు సాధికారిత సాధించేలా ప్లాన్
హెల్త్ సెక్టార్ లో లక్ష మందికి ఉద్యోగాలు
30 లక్షల మందికి ఇండ్ల నిర్మాణం
9వ తరగతి నుండి ప్రతి విద్యార్ధికి ఉచితంగా టాబ్లెట్ అందిస్తాం

ఈ నెల 28 , నవంబర్ 3, నవంబర్ 7,నవంబర్ 10 తేదీల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.