పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారసభలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఓ చెప్పు ఆయనకు తగిలి ఆయన ఒడిలో పడింది.

బీహార్ రాష్ట్రంలో  ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ఔరంగబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచార వేదికపై తేజస్వి యాదవ్ ఇతర నేతలతో కలిసి ఉన్న సమయంలో  రెండు చెప్పులు ఆయనను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు వేశారు.ఒక చెప్పు ఆయనకు తగిలి ఆయన ఒడిలో పడింది. మరోటి  ఆయనకు దూరంగా పడిపోయింది. ఈ చెప్పులను ఎవర వేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటన జరిగిన తర్వాత తేజస్వీ యాదవ్  ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ ఘటనను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.