బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ రోజు తన కరోనా టెస్టు రిపోర్టులో పాజిటివ్ అని ఫలితం వచ్చినట్టు ట్వీట్ చేశారు. తనలో కొన్ని కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకున్నట్టు వివరించారు. తాను ఐసొలేషన్‌లో ఉన్నట్టు పేర్కొంటూ.. తన కాంటాక్టులోకి వచ్చిన వారినీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇదే రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణటాక సీఎం బసరాజ్ బొమ్మైల కరోనా టెస్టు రిపోర్టులు కూడా పాజిటివ్ అనే తేలడం గమనార్హం.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(Coronavirus) వేగంగా వ్యాపిస్తున్నది. దేశంలో థర్డ్ వేవ్ పుంజుకుంటున్న నేపథ్యంలో కీలక రాజకీయ నేతలూ ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా, బీజేపీ(BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. స్వయంగా ఆయన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. తనలో కొన్ని కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకున్నారని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వివరించారు. ఆ కరోనా టెస్టు రిపోర్టు పాజిటివ్(Positive)గా వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వివరించారు. టెస్టు రిపోర్టు పాజిటివ్ రాగానే ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారు వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాలని, కరోనా టెస్టు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి Rajnath Singhకు కూడా కరోనా సోకింది. ట్విట్టర్ వేదికగా మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. సోమవారం నాడు మధ్యాహ్నం కేంద్ర మంత్రి Corona పరీక్షలు చేయించుకొన్నారు. ఈ పరీక్షల్లో కరోనా నిర్ణారణ అయింది. తనకు కరోనా స్వల్ప లక్షణాలున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తాను Home quarantine లో ఉన్నానని మంత్రి చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక వెబ్‌నార్ లో ప్రసంగించారు. సాయుధ దళాలలో చేరడానికి బాలికలకు అవకాశాలను కల్పించడానికి దేశంలో 100 కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రి ప్రకటించారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఇదే రోజు బిహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైల కరోనా టెస్టు ఫలితాలూ పాజిటివ్‌గానే వచ్చాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో 1,216, రాజస్తాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113, ఒడిశాలో 74, ఆంధ్రప్రదేశ్‌లో 28, పంజాబ్‌లో 27, పశ్చిమ బెంగాల్‌లో 27, గోవాలో 19, మధ్యప్రదేశ్‌లో 10, అస్సోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, మేఘలయాలో 4, అండమాన్ నికోబార్‌లో 3, చంఢీఘర్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, పుదుచ్చేరిలో 1, చత్తీస్‌గఢ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసులు నమోదయ్యాయి.
