కేరళ ప్రభుత్వం తన ప్రతి వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం అలవాటు చేసుకుందన్నారు బీజేపీ ఎంపీ, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్. ఏది తప్పో , ఏది మంచో గుర్తించే విచక్షణా జ్ఞానం ఈ దేశ ప్రజలకు వుందని ఆయన అన్నారు. 

కేరళ ప్రభుత్వం తన ప్రతి వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం అలవాటు చేసుకుందన్నారు బీజేపీ ఎంపీ, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్. ఇలాంటి చౌకబారు రాజకీయాలు కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధిని చేకూర్చవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వారు తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని జవదేవకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏది తప్పో , ఏది మంచో గుర్తించే విచక్షణా జ్ఞానం ఈ దేశ ప్రజలకు వుందని ఆయన అన్నారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా మెరుగ్గా ఉండేలా చూస్తున్నారు. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని తాము విమర్శిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ వారం కేరళలో ప్రజలు రేషన్ , పెన్షన్ పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఎన్‌ఐసీ సర్వర్‌లో సాంకేతిక లోపం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని.. కానీ నిజం అందుకు విరుద్ధంగా ఉందని జవదేకర్ దుయ్యబట్టారు. NIC సర్వర్‌తో సమస్య లేదని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వర్‌లో సమస్య ఏర్పడిందని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.

ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అయినా బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ అప్లికేషన్ ప్రస్తుత సర్వర్‌లను గత 7 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నందున వాటిని అప్‌గ్రేడ్ చేయాలని ఆయన కోరారు. రేషన్‌కు పీఓఎస్‌ విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. దేశంలోని 22 రాష్ట్రాల్లో ఉపయోగించే ఈ యాప్‌ను NIC అభివృద్ధి చేసిందని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. 

ఈ వ్యవస్థను మెరుగుపరచాలని ఎన్‌ఐసి కేరళ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినప్పటికీ వారు అలా చేయలేదన్నారు. కేరళ ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రజాపంపిణీ పథకాన్ని స్తంభింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఎద్దేవా చేశారు. పింఛనుదారులకు మాత్రమే అక్షయ కేంద్రం హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని ఆయన గుర్తుచేశారు. అక్షయ్ సెంటర్ సేవలపై హైకోర్టు స్టే విధించిందని.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ సెంటర్ ఈ పథకాన్ని మరొక ఏజెన్సీ ద్వారా నడుపుతోందని పేర్కొందన్నారు.