Asianet News TeluguAsianet News Telugu

చీప్ పబ్లిసిటీలు ఆపాలి... టీడీపీ ఎంపీలపై స్పీకర్ ఫిర్యాదు చేసిన జీవీఎల్

తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదాపై సభలో తన ప్రసంగం ముగిసిన తర్వాత టీడీపీ ఎంపీలు బెదిరింపులకు దిగారని.. ఖబడ్దార్ అంటూ తనను హెచ్చరించారని జీవీఎల్ రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే

BJP MP GVL NARASIMHARAO COMPLAINT TO LOKSABHA SPEAKER AGAINST TDP MP's

తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదాపై సభలో తన ప్రసంగం ముగిసిన తర్వాత టీడీపీ ఎంపీలు బెదిరింపులకు దిగారని.. ఖబడ్దార్ అంటూ తనను హెచ్చరించారని జీవీఎల్ రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే..

తాజాగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతూ పార్లమెంట్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. రోజుకోక నాటకం, రోజుకోక వేషం వేస్తూ పార్లమెంటును అభాసుపాలు చేస్తున్నారని విమర్శించారు.. టీడీపీ డ్రామాలకు తెరదించాలని జీవీఎల్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రచారం కోసం పార్లమెంట్‌ను ఉపయోగించుకోవడం సరికాదని.. పాలన వదిలేసి దగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు చీప్ పబ్లిసిటీ ప్రయత్నాలను మానుకోవాలని నరసింహారావు హితవు పలికారు.

Follow Us:
Download App:
  • android
  • ios