జీవీఎల్‌కు టీడీపీ నేతలు బెదిరింపులు.. వెంకయ్యకు ఫిర్యాదు

First Published 30, Jul 2018, 6:47 PM IST
bjp mp gvl narasimha rao moves privilege motion against TDP
Highlights

టీడీపీ నేతలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. ప్రత్యేకహోదా అమలు, విభజన చట్టం హామీలపై చర్చయ సందర్భంగా రాజ్యసభలో తన ప్రసంగం ముగిసిన తర్వాత టీడీపీ నేతలు తనను బెదిరించారని జీవీఎల్ ఆరోపించారు

టీడీపీ నేతలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. ప్రత్యేకహోదా అమలు, విభజన చట్టం హామీలపై చర్చయ సందర్భంగా రాజ్యసభలో తన ప్రసంగం ముగిసిన తర్వాత టీడీపీ నేతలు తనను బెదిరించారని జీవీఎల్ ఆరోపించారు. ‘‘ఖబడ్దార్’’ తీవ్ర పరిణామాలుంటాయంటూ తెలుగుదేశం నేతలు తనను హెచ్చిరించారని నరసింహారావు నోటీసులో పేర్కొన్నారు..

ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను ఆయన రాజ్యసభ కార్యదర్శికి అందజేశారు.. వారి వైఫల్యాలను ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని జీవీఎల్ తెలిపారు. టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీవీఎల్ వ్యవహారం మరోసారి ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకలు భావిస్తున్నారు.

loader