Asianet News TeluguAsianet News Telugu

గౌతం గంభీర్‌కు ఐఎస్ఐఎస్ నుంచి బెదిరింపులు.. ప్రొటెక్షన్ పెంచిన ప్రభుత్వం

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు ‘ఐఎస్ఐఎస్ కశ్మీర్’ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్స్ రూపంలో ఆయనకు బెదిరింపులు లేఖలు వచ్చాయి. చంపేస్తామన్న బెదిరింపులు రావడంతో ఆయన వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. రాజేంద్ర నగర్‌లోని గంభీర్ నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.

bjp mp gautam gambhir gets death threats from ISIS Kashmir
Author
New Delhi, First Published Nov 24, 2021, 1:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌(Gautam Gambhir)కు ‘ఐఎస్ఐఎస్ కశ్మీర్’(ISIS Kashmir) నుంచి బెదిరింపులు(Death Threats) వచ్చాయి. చంపేస్తామన్ని వార్నింగ్‌లు వచ్చాయి. దీంతో ఆయన వెంటనే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి తనకు చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ సెక్యూరిటీ గౌరవ్ అరోరా సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీకి ఫిర్యాదు అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. Delhiలోని రాజేంద్ర నగర్‌లోని గౌతం గంభీర్ నివాసం వద్ద ప్రొటెక్షన్ పెంచారు.

గౌతం గంభీర్‌కు ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగారని డీసీపీ సెంట్రల్ శ్వేత చౌహాన్ వివరించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. గౌతం గంభీర్‌కు ఈ మెయిల్స్ రూపంలో బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్‌లోనే బెదిరింపు లేఖలను గౌతం గంభీర్‌కు పంపినట్టు తెలిసింది. ఇతర రూపాల్లో వచ్చిన బెదిరింపుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ మెయిల్స్ అడ్రస్ వెరిఫికేషన్ సహా ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతున్నది. 

Also Read: ‘నీ కూతుర్ని బార్డర్ కు పంపి అప్పుడు ఆయనను ఎలాగైనా పిలుచుకో..’: టీమిండియా మాజీ క్రికెటర్ పై మండిపడ్డ గంభీర్

గౌతం గంభీర్ ఎంపీ ఆఫీసు మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఈ మెయిల్ వచ్చినట్టు వివరించారు. ఇందులో ఎంపీ గౌతం గంభీర్, ఆయన కుటుంబాన్ని చంపేస్తామనే బెదిరింపులు వచ్చినట్టు పీఎస్ గౌరవ్ అరోరా తెలిపారు.

పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబాట్లు చేస్తున్న ఉగ్రవాదంపై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు గుండా టెర్రరిజం ముప్పు ముగిసే వరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు నెరపాల్సిన అవసరం లేదని ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో పేర్కొన్నారు. ఎందుకంటే సరిహద్దులో పహారా కాస్తున్న భారత సైనికుల ప్రాణాలే అన్నింటి కంటే తమకు ప్రధానమని అన్నారు.

Also Read: T20 World Cup: వాళ్లదీ వైరమే.. కానీ మనలా కాదు..! కివీస్-ఆసీస్ ఫైనల్ ముందు గంభీర్ సంచలన వ్యాఖ్యలు

అంతకు ముందు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది వ్యాఖ్యాలకూ గతేడాది తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. షాహిద్ అఫ్రీదీ జమ్ము కశ్మీర్ పై గతేడాది మే 15న వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలు ఎదుర్కొంటున్న ఘోర పరిస్థితులను ఆలోచించాలనుకుంటే అదే మతం వారై ఉండాల్సిన అవసరం లేదని, కేవలం సహృదయం ఉంటే చాలు అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. దీనిపై గంభీర్ స్పందించారు. ఇది దురదృష్టకరమని గంభీర్ ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలు షాహిద్ అఫ్రీది, ఆయన దేశం ఆలోచించేవి మాత్రమే అని పేర్కొన్నారు.

క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన గౌతం గంభీర్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్‌పై 2019లో లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌లో ఆయన 15 ఏళ్లు ఆడారు. 2018లోనే ఆయన అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios