పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ని కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA Slaps Constable in MP Police Station After Nephew's Call, Caught on Camera
Highlights

 వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే
 

బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో ఇరుక్కున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. అందరి ముందు కానిస్టేబుల్ పై చెయ్యి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో  చర్చనీయాంశమైంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్‌డా గురువారం రాత్రి ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. ఆయన మేనల్లుడు కారణంగానే ఈ వివాదం అంతా జరిగినట్లు తెలుస్తోంది. 

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే... ఎమ్మెల్యే మేనల్లుడు ఓ కేసులో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.  స్టేషన్ కి రాగానే.. ఇష్టానుసారంగా వ్యవహరించాడు. స్టేషన్ లోపలికి వెళ్లి అక్కడున్న ఇద్దరు నిందితుల నుంచి ఓ వాటర్ బాటిల్ తీసుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే మేనల్లుడిని పోలీస్ ప్రశ్నించాడు. ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. 

ఈ నేపథ్యంలో అతను జరిగినదంతా ఫోన్ చేసిన ఎమ్మెల్యే దేవ్‌డాకు తెలియజేశాడు. పోలీస్ స్టేషన్‌కు ఆగ్రహావేశాలతో వచ్చిన ఎమ్మెల్యే దేవ్‌డా.. అక్కడున్న పోలీస్‌పై చేయిచేసుకున్నారు.  నా మేనల్లుడినే ప్రశ్నిస్తావా అంటూ పోలీస్‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలకు ఇదంతా చిక్కింది. 

ఇంకేముంది.. ఈ వీడియోని అన్ని మీడియా ఛానెళ్లు ప్రసారం చేయడంతో విషయం ఇంకాస్త పెద్దదైంది. అనంతరం కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

loader