కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు: బయటపెట్టిన భార్య

BJP MLA's wife claims husband having extramarital affair with college student
Highlights

తన భర్త ఓ కాలేజీ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జమ్మూ కాశ్మీర్ కు చెందిన శాసనసభ్యుడి భార్య ఆరోపించింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమెతో అతను కలిసి ఉంటున్నాడని ఆమె మీడియా సమావేశంలో చెప్పారు. 

శ్రీనగర్‌: తన భర్త ఓ కాలేజీ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జమ్మూ కాశ్మీర్ కు చెందిన శాసనసభ్యుడి భార్య ఆరోపించింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమెతో అతను కలిసి ఉంటున్నాడని ఆమె మీడియా సమావేశంలో చెప్పారు. 

జమ్మూ కాశ్మీర్ లోని ఆర్‌ఎస్‌ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్‌ పై ఆయన భార్య మోనికా శర్మ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగమ కార్యదర్శి కూడా. గగన్‌ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. 

తన భర్త మంచోడు కాడని, గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అఫైర్‌ నడుపుతున్నారని ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారని అన్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయానని అన్నారు. "ఇప్పుడు ఫొటోలతో కూడిన ఆధారాలతో మీ ముందుకు వచ్చాను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి" అని ప్రధాని మోడీకి, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాకు ఆమె విజ్ఞప్తి చేశారు. 

 మోనికా ఆరోపణలను గగన్‌ కొట్టిపారేశారు. తమ మధ్య విభేదాలున్నాయని, దాంతో  ఆమె విడాకులు కోరిందని, పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా వద్దని వారించానని, ప్రస్తుతం కౌన్సిలింగ్‌ జరుగుతోందని అన్నారు. తనపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.  

అయితే కౌన్సిలింగ్‌ జరుగుతున్న మాట వాస్తవమేనని, తనకు భరణం కూడా గగన్‌ చెల్లించడం లేదని మోనికా చెబుతున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు భార్యభర్తలు ఇద్దరూ హాజరయ్యారు. 

ఆ సమయంలోనే పార్టీ కార్యాలయం బయట యువతి తాత నిరసన ప్రదర్శనకు దిగారు. గత నెల చివర్లో తన కూతురిని గగన్‌ అపహరించాడంటూ పంజాబ్‌కు చెందిన ఓ మాజీ సైనికాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని ఎట్టకేలకు రక్షించి మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

గగన్‌ చాలా మంచి వ్యక్తి అని ఆ యువతి కితాబు ఇచ్చింది. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పింది. తన తల్లిదండ్రులను ప్రలోభపెట్టి గగన్‌పై ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని అన్నది. యువతితో గగన్ సన్నిహితంగా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader