మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో భాగమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) తీరును తప్పుబట్టింది. శరద్ పవార్ మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించడమేమిటని ప్రశ్నించింది.

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో భాగమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) తీరును తప్పుబట్టింది. శరద్ పవార్ మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించడమేమిటని ప్రశ్నించింది. ఆయన ఏ హోదాలో మంత్రులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తారని ప్రశ్నించింది. శరద్‌ పవార్ మంత్రులతో రాజకీయ సమావేశం నిర్వహించారని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, ఘాట్కోపర్ ఎమ్మెల్యే రామ్ కదమ్ (BJP MLA Ram Kadam) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

వివరాలు.. గత రెండు నెలలుగా MSRTC కార్మికులు, యూనియన్లు తమ వివిధ డిమాండ్ల కోసం నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూనియన్లు ఏర్పాటు చేసుకన్న యాక్షన్ కమిటీ సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిగింది. 22 మంది వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో శరద్ పవార్, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరవ్ సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమ్మెలో ఉన్న సిబ్బందికి పవర్ భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు తమ ఆందోళనను విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వాన్ని విశ్వసించాలని, అన్ని డిమాండ్లు నెరవేరతాయని చెప్పారు. రాష్ట్రానికి రాష్ట్ర రవాణాల సంస్థ చాలా కీలకమైనదని పేర్కొన్నారు.

అయితే ఈ సమావేశంలో శరద్ పవార్ ఏ హోదాలో పాల్గొన్నారో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సీఎం ఉద్ధవ్ థాకరే గైర్హాజరు కావడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వ నూతన తాత్కాలిక ముఖ్యమంత్రిగా శరద్ పవార్ నియమితులయ్యారా? అంటూ రామ్ కదమ్ ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి మంత్రులు, అధికారుల సమావేశం ఎలా నిర్వహిస్తారని అని నిలదీశారు. శరద్ పవార్ సమావేశాలు నిర్వహించాల్సి వస్తే.. ఆయనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎందుకు ఇవ్వరు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలని కోరారు. 

Scroll to load tweet…

దీనికి సంబంధించి Organiser Weeklyకి చెందిన జర్నలిస్ట్ రాజ్‌ గోపాల్ కూడా స్పందించారు. ‘రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఎవరైనా చెబితే విన్నారా? రాజ్యాంగ ఔచిత్యం రాజీపడిందా? లేదు.. వారు అలాంటిదేమీ చెప్పరు. ఎందుకంటే.. అక్కడుంది శరద్ పవార్’ అంటూ తన ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.