సంబల్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆ అభియోగాన్ని తోసిపుచ్చారు. ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధానే తనను నెట్టారని ఆరోపించారు.
భువనేశ్వర్ : భువనేశ్వర్ లో మహిళా పోలీసు అధికారిపై బీజేపీ నేత దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. సంబల్‌పూర్‌లో బీజేపీ నిరసనలు చేస్తున్న సమయంలో లంచం తీసుకుంటోందని ఆరోపిస్తూ ఓ మహిళా పోలీసు అధికారిపై ఒడిశా ప్రతిపక్ష నేత జయనారాయణ మిశ్రా దాడి చేయడం వివాదాస్పదమైంది. అయితే, సంబల్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆ అభియోగాన్ని తోసిపుచ్చారు. ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధానే తనను నెట్టారని ఆరోపించారు.
ఈ ఘటన మీద ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బుధవారం ఈ ఘటన సంబల్‌పూర్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట జరిగింది. శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సంబల్‌పూర్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలుపల బిజెపి నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన మీద అనితా ప్రధాన్ మాట్లాడుతూ.. బిజెపి కార్యకర్తలు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వారిని కంట్రోల్ చేస్తూ ఆమె మిశ్రాకు ఎదురుగా వచ్చింది. దీంతోను నువ్వెవరు అని మిశ్రా అడిగాడు. ఆమె తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోగానే.. నువ్వు లంచం తీసుకుంటున్నావని ఆరోపించాడు. నన్ను డకాయిట్ అని పిలిచాడు. అలాంటి ఆరోపణలుఎందుకు చేస్తున్నారని నేను అడిగినప్పుడు, మిశ్రా నా ముఖం మీద చేయివేసి వెనక్కి నెట్టాడు" అని మహిళా అధికారి చెప్పారు.
పుగైలాయిపట్టిలో ఘనంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం.. 23 మందికి గాయాలు
అయితే మహిళా కార్మికులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని విని తాను ముందుకొచ్చానని మిశ్రా అభియోగాన్ని తోసిపుచ్చారు. "నేను పోలీసులపై దాడి చేశానని, విరుచుకుపడుతున్నానని, నెట్టానని అంటున్నారు. కానీ నేను ఆమెను నెట్టలేదు. పోలీసులపై ఆరోపణలు వచ్చినందున, వారు కుట్ర పన్నారు... నాకు ఆమె ఎవరో తెలియదు’ అని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు.
ఘటనపై ఫీల్డ్ రిపోర్టు కోరామని, దీనిపై విచారణ జరుపుతామని సంబల్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ బి గంగాధర్ తెలిపారు. మిశ్రాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒడిశా పోలీస్ సర్వీస్ అసోసియేషన్, సంబల్పూర్ చాప్టర్ ఉత్తర రేంజ్ డీఐజీకి వెళ్లింది. బీజేపీ అధికార ప్రతినిధి లలితేందు బిద్యాధర్ మహపాత్ర మాట్లాడుతూ.. జార్సుగూడ జిల్లాలో ఓ పోలీసు మంత్రిని హత్య చేశాడని.. ఇప్పుడు ఓ మహిళా పోలీసు ప్రతిపక్ష నేతపై విరుచుకుపడుతోందని.. ఒడిశాలో చట్టబద్ధత లేదు.. ఆ అధికారికి వ్యతిరేకంగా సీఎం దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎదురుచూస్తున్నామని అన్నారు.
ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో శాంతిభద్రతల అంశాన్ని మిశ్రా లేవనెత్తుతారని అధికార పార్టీ భయపడుతోందని అన్నారు. మరోవైపు, బీజేడీ అధికార ప్రతినిధి శ్రీమయీ మిశ్రా మాట్లాడుతూ, "జయనారాయణ మిశ్రా సాధారణ నేరస్థుడని, అతనిపై హత్యతో సహా 14 కేసులు నమోదయ్యాయి, దాని కారణంగా జైలుకు కూడా వెళ్లాడు. అతను ప్రజలను బెదిరించడం, దాడి చేయడం కొత్తేం కాదు" అన్నారు.
