మహారాష్ట్రలో బిజెపి కార్యకర్త కుటుంబం దారుణ హత్య

మహారాష్ట్రలో బిజెపి కార్యకర్త కుటుంబం దారుణ హత్య

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో హత్యకు గురయ్యింది ఓ బిజెపి కార్యకర్త కుటుంబంగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ దారుణ హత్యలపై పలు అనుమానాలు మొదలయ్యాయి.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగ్‌పూర్ పట్టణంలోని ఆరాధనా నగర్‌లో బీజేపి పార్టీకి చెందిన కమలాకర్ పవన్‌కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇతడితో పాటు మరో నలుగురు ఇతడి కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వారు నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు.
 
ఈ హత్యలపై ససమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి గొడవలు, రాజకీయ తగాదాలు, ప్రత్యర్థులతో ఘర్షనలు ఏమైనా ఈ హత్యలకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page