నాగాలాండ్  అసెంబ్లీ ఎన్నికల్లో   బీజేపీ  నేతృత్వంలో  సంకీర్ణ కూటమి  ముందంజలో  ఉంది.  2018 నుండి   ఎన్‌డీపీపీ, బీజేపీ మిత్రపక్షంగా  ఉన్నాయి.


న్యూఢిల్లీ: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ముందంజలో ఉంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ , ఆ పార్టీ మిత్రపక్షమైన ఎన్‌డీపీపీ అభ్యర్ధులు 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. నాగాలాండ్ అసెంబ్లీలోని 60 స్థానాల్లో 40 స్థానాల్లో ఎన్‌డీపీపీ , 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. 

నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో నేతృత్వంలోని ఎన్‌డీపీపీ 2018 నుండి బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ కూటమి 30 సీట్లను గెలుచుకుంది. ఎన్‌పీఎఫ్ 26 సీట్లలో విజయం సాధించింది. నాగాలాండ్ రాష్ట్రాన్ని 2003 వరకు కాంగ్రెస్ పార్టీ పాలించింది. నాగాలాండ్ ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 

also read:త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: ఆధిక్యంలో బీజేపీ

గత నెల 27వ తేదీన రాష్ట్రంలోని 59 అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జున్హెబోటో జిల్లాలోని అకులుటో స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.