బిజెపి నాయకుడు రాజేంద్ర పాండే తన భార్యతో ఏదో విషయంలో వాగ్వాదానికి దిగి.. రెచ్చిపోయి 12-బోర్ తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ ఆమె నడుముకు తగిలి మరణించింది.
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో వివాదం కారణంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఒకరు తన భార్యను కాల్చిచంపినట్లు పోలీసు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున నగరంలోని రాతీబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో చోటుచేసుకుంది.
ఈ ఘటన తర్వాత బీజేపీ నేత రాజేంద్ర పాండే పరారీలో ఉన్నారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ పాండే మాట్లాడుతూ, "నగరంలోని రాతిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున 1 గంటలకు ఈ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న బిజెపి నాయకుడు రాజేంద్ర పాండేతో ఏదో విషయంపై అతని భార్యకు వాగ్వాదం జరిగింది. ఆవేశంతో తన భార్యను 12-బోర్ తుపాకీతో కాల్చి చంపాడు.
రైల్వేస్టేషన్‌లో కరెంట్ షాక్ తో టీచర్ మృతికి అరగంట ముందు.. అదే విద్యుదాఘాతానికి మరో యువకుడు బలి...
సంఘటన జరిగినప్పుడు,పాండే కుమార్తె, అతని అల్లుడు కూడా ఇంట్లో ఉన్నారు. నేరం చేసిన తర్వాత నిందితుడు రాజేంద్ర పాండే పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసు బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని తెలిపారు.నిందితుడు పాండే గతంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. "పార్టీలో అతని ప్రస్తుత హోదా గురించి మాకు సమాచారం లేదు" అని అధికారి తెలిపారు.
