సాక్షి అహుజా మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన రోజునే 17 ఏళ్ల సోహైల్ అనే బాలుడు మృతి చెందడం వెలుగు చూసింది.
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం 34 ఏళ్ల మహిళ తన పిల్లల ముందు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరగడానికి అరగంట ముందు, నగరంలోని మరో ప్రాంతంలో ఓ 17 ఏళ్ల యువకుడు రైలు మార్గం నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తూ మరణించాడు. లైవ్ వైర్ వీధిలోని నీటిలో పడిపోవడంతో కరెంట్ షాక్ కొట్టింది.
సాక్షి అహుజా చనిపోయిన రెండు రోజులకు 17 ఏళ్ల సోహైల్ మరణం వెలుగులోకి వచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ మహిళ మరణంపై రైల్వే బోర్డు ఛైర్మన్, ఢిల్లీ ప్రభుత్వం, నగర పోలీసులకు నోటీసులు పంపింది, ఇది "ప్రాణాంతక లోపాలను సూచిస్తుంది", "అధికారులస్పష్టమైన నిర్లక్ష్యం" అంటూ అందులో పేర్కొంది.
బెంగళూరు నివాసి అయిన సోహైల్ సెలవుల కోసం 45 రోజుల క్రితం దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. పగటిపూట మేనమామ ఇంట్లో ఉంటూ రాత్రి తూర్పు ఢిల్లీలోని సీమాపురిలోని మరో బంధువు జమాల్ ఇంటికి వెళ్లి నిద్రించేవాడు. శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో.. యువకుడు తన మామ ఇంటికి తిరిగి రావడానికి ఆదివారం తెల్లవారుజామున జమాల్ ఇంటి నుండి బయలుదేరాడు.
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తన మామ ఇంటికి సమీపంలోని తైమూర్ నగర్‌కు చేరుకోగా ఓ వీధిలో నీరు నిలిచింది. దాటడానికి నీటిలోకి అడుగు పెట్టగానే కరెంట్ షాక్ కొట్టింది. అటునుంచి వెడుతున్న వారు సొహైల్ కేకలు వేయడం.. ఒక్కసారిగా కుప్పకూలిన శబ్దాలు విన్నారు. నీటిలో వైరు ఉండడం గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో వారు విద్యుత్‌ను నిలిపివేశారు.
ఫ్యామిలీతో హాలిడేకు వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. రైల్వే స్టేషన్ వద్ద కరెంట్ షాక్‌తో టీచర్ మృతి..
సోహైల్ కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అరగంట తరువాత.. తైమూర్ నగర్ నుండి 16 కి.మీ దూరంలో, సాక్షి అహుజా(34) అనే టీచర్, తన ఏడు, తొమ్మిది సంవత్సరాల వయస్సున్న పిల్లలు, తండ్రి, ఆమె కుటుంబ సభ్యులతో ఉదయం 5:30 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఆమె మృతి చెందింది. నీటిని దాటే క్రమంలో ఆమె విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో షాక్ కొట్టింది.
సాక్షి మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం రోజు నోటీసులు పంపింది. పౌర, విద్యుత్ అధికారులతో పాటు, భారతీయ రైల్వేలు కూడా స్టేషన్‌లో "అలాంటి ప్రాణాంతక లోపాలపై నిఘా ఉంచడంలో విఫలమైనట్లు కనిపిస్తున్నాయి" అని ఒక ప్రకటనలో పేర్కొంది.
సాక్షి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో అంబులెన్స్, వైద్యులు లేదా పోలీసులు లేనందున ఆమెకు ఎటువంటి సహాయం లేదా ప్రథమ చికిత్స అందలేదని చెప్పారు. అన్ని బైటికి వెళ్లే వాహనాలతో నిండిపోవడంతో కుటుంబం 40 నిమిషాల తర్వాతే స్టేషన్ నుండి బయటికి వచ్చింది. అప్పటికే కరెంట్ షాక్ కొట్టి అచేతనంగా ఉన్న సాక్షిని కొద్ది దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.
"రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటామని మాకు తెలియజేసారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా వ్యవస్థ మెరుగుపడటం లేదు.వందేభారత్ వంటి అధిక నాణ్యత గల రైళ్లను తయారు చేస్తున్నాం, కానీ సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోయాం. స్టేషన్‌ల వద్ద... భారీ సంఖ్యలో కాలినడకన ప్రయాణిస్తున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేవు" అని రైల్వే సరికొత్త, అత్యాధునిక రైలులో చండీగఢ్‌కు వెడుతున్న ప్రయాణికుడు చోప్రా అన్నారు.
