షారుఖ్ ఖాన్‌కు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. ఖతర్‌కు ఖాన్‌ను వెంట తీసుకెళ్లాల్సింది: సుబ్రమణ్యస్వామి సంచలనం
బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖతర్ మన దేశ మాజీ నేవీ అధికారులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం షారుఖ్ ఖాన్ సహాయం తీసుకున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎస్ఏలతో ఈ సెటిల్‌మెంట్ సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖతర్ పర్యటనకు తన వెంట ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను వెంట తీసుకెళ్లాల్సింది.. అని అన్నారు. ఖతర్ చెర నుంచి మన మాజీ నేవీ అధికారులకు విముక్తి కల్పించడానికి షారుఖ్ ఖాన్‌కు మోడీ విజ్ఞప్తి చేశారని, షారుఖ్ ఖాన్ వల్లే వారు విడుదలయ్యారు అని కామెంట్ చేశారు. ఈ షాకింగ్ కామెంట్స్ సుబ్రమణియన్ స్వామి.. ఏకంగా ప్రధాని మోడీ ట్వీట్‌కు రెస్పాన్స్‌గా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
‘మోడీ తన వెంట షారుఖ్ ఖాన్‌ను ఖతర్‌కు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) ఖతర్ షేక్‌లను కన్విన్స్ చేయడంలో విఫలం అయ్యారు. అందుకే మోడీ షారుఖ్ ఖాన్‌కు విజ్ఞప్తి చేసి ఈ వ్యవహారంలోకి దింపారు. షారుఖ్ ఖాన్‌తోనే ఖతర్ షేక్‌లు కన్విన్స్ అయ్యారని, భారీ సెటిల్‌మెంట్‌తో నేవీ అధికారులను విడుదల చేశారు’ అని సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు.
Also Read: Bengaluru: హెల్మెట్ లేదని బైక్ ఆపితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు.. అధికారులు ఏం చేశారంటే?
ఈ రెండు రోజులు తాను యూఏఈ, ఖతర్ దేశాలు పర్యటించబోతున్నానని, భారత్‌తో ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత వేళ్లూనుకోవడానికి అనేక కార్యక్రమాలకు హాజరు కాబోతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రెస్పాన్స్‌గా సుబ్రమణియన్ పై కామెంట్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సుబ్రమణియన్.. ఆ వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను చూపెట్టలేదు. ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనంగా మారాయి.