New Delhi: ఎన్నికల కోసం డబ్బును దోచుకునేందుకే మద్యం పాలసీని రూపొందించారని ఆప్ ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. అలాగే, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు అధిపతిగా ఉన్న మనీష్ సిసోడియా పాఠశాలలు, కళాశాలలు ఎక్కడ తెరిచారో వాటిని బీజేపీకి చూపించాలంటూ వ్యాఖ్యానించారు.
BJP MP Gautam Gambhir: భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ ను 'ఓపెన్ అండ్ షట్ కేసు'గా అభివర్ణించిన గంభీర్.. ఖలిస్థాన్ గ్రూప్ సాయంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బును ఉపయోగించుకునేందుకే ఈ విధానాన్ని రూపొందించారని ఆరోపించారు. కాబట్టి ఆప్ నేతలకు దక్కాల్సినవి దక్కాలంటూ మనిష్ సిసోడియా అరెస్టు పై స్పందించారు. అలాగే, మద్యం కుంభకోణం కేసులో ఒక విద్యాశాఖ మంత్రి జైలుకు వెళ్లడం దేశంలో ఇదే మొదటిసారి అంటూ మనీష్ సిసోడియాపై విమర్శలు చేశారు.
"ఇది ఓపెన్ అండ్ క్లోజ్ కేసు. వారికి దక్కాల్సినది దక్కాలి. మద్యం కుంభకోణం కేసులో ఒక విద్యామంత్రి తీహార్ జైలుకు వెళ్లడం భారత్ లో ఇదే తొలిసారి. ఖలిస్థాన్ సాయంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బును దోచుకునేందుకే ఈ విధానాన్ని రూపొందించారు" అని గౌతమ్ గంభీర్ ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు అధిపతిగా ఉన్న మనీష్ సిసోడియా పాఠశాలలు, కళాశాలలు తెరిచారంటే దాన్ని బీజేపీకి చూపించాలని ఆయన అన్నారు. మద్యం పాలసీలో ఎలాంటి అవకతవకలు జరగకపోతే దాన్ని వెనక్కి తీసుకునే వారు కాదని పేర్కొన్నారు. "భావోద్వేగ ప్రకటనలు ఇవ్వడానికి ఇది సమయం కాదు. ఆయన (సిసోడియా) స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు తెరిస్తే మాకు చూపించండి. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చర్యలు నేడు బహిర్గతమయ్యాయి' అని ఆయన అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత గతంలో చేసిన రాజీనామా వైఖరిని గుర్తు చేస్తూ జైలులో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వంలోని మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా చేయాలని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నేత హరీష్ ఖురానా డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 8 గంటల విచారణ అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సిసోడియా, జైన్ రాజీనామా చేయాలని బీజేపీ నేత హరీష్ ఖురానా డిమాండ్ చేశారు.
కాగా, సోమవారం నాడు కస్టడీకి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. "ఆయనకు సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఉంది కానీ నైతిక ప్రాతిపదికన ఒక ప్రశ్న లేవనెత్తుత్తూ.. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ 2013లో చెప్పేవారు. ఆ ఆరోపణ తర్వాత నిరూపితమవుతుంది. నితిన్ గడ్కరీ, షీలా దీక్షిత్, చిదంబరం వంటి నేతలపై ఆయన ఆరోపణలు చేశారు. కానీ నేడు తమ మంత్రి ఒకరు 8 నెలలు జైల్లో ఉన్నారని, మరొకరు పోలీసు రిమాండ్ లో ఉన్నారనే విషయాన్ని" ప్రస్తావించారు.
"ఇద్దరు ఢిల్లీ మంత్రులు జైలులో ఉన్నారు. సత్యేందర్ జైన్ ను మీరు ఈ రోజు వరకు తొలగించలేదు. నీ నైతికత ఎక్కడుంది? ఇద్దరు మంత్రుల నైతికత ఆధారంగా రాజీనామా చేయించాలని మేము మిమ్మల్ని (అరవింద్ కేజ్రీవాల్) కోరుతున్నాము. సిసోడియా వద్ద 22 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. వారిని జైలు నుంచి తరిమేస్తారా? ఢిల్లీలో రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా.." అని బీజేపీ నేత ప్రశ్నించారు.
