Asianet News TeluguAsianet News Telugu

రేపు కాదు, ఈ రోజే పట్టం.. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఫడ్నవీస్

మహారాష్ట్ర సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.

BJP leadedr Devendra Fadnavis to take oath as Maharashtra CM today
Author
Mumbai, First Published Jun 30, 2022, 3:55 PM IST

మహారాష్ట్ర సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లు రాజ్ భవన్ కు బయల్దేరారు. 

ఇకపోతే.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. సుమారు వారం పాటు సాగిన రిసార్టు రాజకీయం నిన్నటి సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి బల పరీక్షకు ఆదేశాలు జారీ చేసిన గవర్నర్ బీఎస్ కొశ్యారీ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు వెలువడిన స్వల్ప వ్యవధిలోనే ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. 

ఈ పరిణామంతో రెబల్స్‌కు, బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి వీడి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీలో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ మేరకు రేపు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనివార్య కారణాలతో ఈ రోజే ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత తెలంగాణలో పర్యటించనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 2వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా హాజరుకాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

ఇదిలా ఉండగా, ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఈ ప్రభుత్వంలో ఏ హోదా దక్కనుందనే చర్చ కూడా మరో వైపు మొదలైంది. సుమారు 12 మినిస్ట్రియల్ బెర్త్‌లు షిండే వర్గానికి దక్కనున్నట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. కాగా, ప్రహర్ వంటి కొన్ని చిన్న పార్టీలకూ కొత్త ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభించనున్నట్టు సమాచారం. స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి ముగ్గురికి మంత్రి సీట్లు దక్కనున్నాయి. ఈ మూడు సీట్లు అటు బీజేపీ, ఇటు షిండే కోటాలో భర్తీ చేయనున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios