లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. బీజేపీ ప్రజల గొంతుకలను నొక్కి వేస్తుందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ కు ప్రతీ గొంతుకను వింటుందని తెలిపారు.
దేశం మొత్తం మీద బీజేపీ కిరోసిన్ చల్లిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా’’ పేరుతో లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు మంచి స్థానంలో లేదని అన్నారు. ఒక చిన్న నిప్పు రవ్వ కూడా ఇప్పుడు పెద్ద ఇబ్బందులకు దారి తీస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు, ప్రజలు, వర్గాలు, రాష్ట్రాలు, మతాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
యూకే పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార పార్టీ దేశమంతటా కిరోసిన్ పోసిందని, ఒక నిప్పురవ్వ మాత్రమే ఇప్పుడు పెద్ద సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ మేము ఈ ఉష్ణోగ్రతను చల్లబరచాలి. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత చల్లబడకపోతే విషయాలు తప్పు కావచ్చు" అని చెప్పారు.
తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. హైదరాబాద్ తర్వాత బీఏ.4 వేరియంట్ రెండో కేసు గుర్తింపు
భారతదేశంలో రెండు విభిన్నమైన పాలనా విధానాలు ఉన్నాయని.. అందులో ఒకటి గొంతులను అణచివేసేదని, మరొకటి వినేదని అన్నారు. ‘‘ బీజేపీ లాంటి క్యాడర్ ఉండాలని ప్రజలు అంటున్నారు. కానీ అలాంటి క్యాడర్ ఉంటే మనం బీజేపీయే అవుతామని నేను వారికి చెబుతున్నాను. భారతీయ ప్రజల భావాలను వినే పార్టీ మాది. BJP గొంతులను అణచివేస్తుంది, మేము వింటాము. దయచేసి గ్రహించండి, BJP అరుస్తుంది. గొంతులను అణచివేస్తుంది. కానీ మాకు వినడమే తెలుసు. అవి రెండు వేర్వేరు విషయాలు. అవి రెండు వేర్వేరు డిజైన్‌లు. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
‘‘ కమ్యూనిస్ట్ ఆలోచన విధానం అయినా RSS విధానం అయినా నిర్దిష్ట ఆలోచనలను ప్రజల గొంతులోకి పంపించడానికి రూపొందించబడింది. కానీ మేము అలా రూపొందించబడలేదు. మేము భారతదేశ ప్రజలను వినడానికి, వారి గొంతును బయటకు తీసి టేబుల్‌పై ఉంచడానికి రూపొందించాము ’’ అంటూ బీజేపీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రతీ ప్రధానికి వినాలనే వైఖరి ఉండాలని, కానీ తమ ప్రధాని అస్సలు వినరు అని ఆరోపించారు.
మరుగుదొడ్లకు ఔరంగజేబు పేరు.. ఆలయాలను అవమానించినందుకు ప్రతీకారంగానే అంటున్న బీజేపీ నేత..
కాంగ్రెస్ పదే పదే ఎన్నికల పరాజయాలు, బీజేపీ విజయాలకు గల కారణాలు ఏంటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పొలరైజేషన్, మీడియాపై పూర్తి ఆధిపత్యం ఎన్నికలలో అధికార పార్టీ విజయాల వెనుక కారకాలు అని అన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ జన సమూహంలోకి చొచ్చుకెళ్లే నిర్మాణాన్ని డెవలప్ చేసిందని, ప్రతిపక్షాలు, కాంగ్రెస్‌లు కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘బీజేపీకి ఓటు వేయని 60-70 మంది వద్దకు మనం మరింత దూకుడుగా వెళ్లాలి. మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది ’’ అని ఆయన అన్నారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం ఈ రూపంలో ఎప్పుడూ లేదని అన్నారు. ‘‘ ఒక కంపెనీ అన్ని విమానాశ్రయాలు, అన్ని పోర్టులు, అన్ని మౌలిక సదుపాయాలను నియంత్రించడం చాలా ప్రమాదకరమని నేను భావిస్తున్నాను. ఇది (ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం) ఈ రూపంలో ఎప్పుడూ లేదు. అధికారం, మూలధనం వంటి భారీ కేంద్రీకరణతో ఇది ఎప్పుడూ ఉనికిలో లేదు” అని ఆయన అన్నారు.
