Asianet News TeluguAsianet News Telugu

మరుగుదొడ్లకు ఔరంగజేబు పేరు.. ఆలయాలను అవమానించినందుకు ప్రతీకారంగానే అంటున్న బీజేపీ నేత..

ఆలయాలను అవమానించినందుకు ప్రతీకారంగా ఢిల్లీ బీజేపీ నేత అచల్ శర్మ టాయిలెట్‌ కు ఔరంగజేబు పేరు పెట్టి తన నిరసన తెలిపారు. 

Delhi BJP leader puts up Aurangzebs name on toilet as revenge for 'insulting temples
Author
Hyderabad, First Published May 21, 2022, 12:12 PM IST

ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని ఓ మరుగుదొడ్డిపై బీజేపీ నేత అచల్ శర్మ ‘ఔరంగజేబు ముత్రాలయ్’ అనే పోస్టర్‌ను అంటించారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని ఇతర మరుగుదొడ్లకు కూడా ఇలాంటి పోస్టర్లు అతికించాలని ఆయన ప్రజలను కోరారు. ఇలా చేయడం వల్ల ఆలయాలను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లు బీజేపీ నేత అన్నారు.

అంతేకాదు "అన్ని టాయిలెట్లకు ఔరంగజేబ్ మూత్రాలయ్ లేదా శౌచలయ్ అని పేరు మార్చాలని నేను హిందూ సమాజాన్ని అభ్యర్థిస్తున్నాను" అని కూడా బిజెపి నాయకుడు అన్నారు. ‘ముస్లింలు చేసింది సరైన పని కాదు.  400 నుంచి 500 ఏళ్లుగా జ్ఞాన్వాపీ మసీదులో శివలింగాన్ని దాచి ఉంచారు’ అని.. ఈ అన్యాయానికి సమాధానమే తన చర్య అని  శర్మ తెలిపారు. 

అంతేకాదు “జామా మసీదును శోధించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ కూడా హిందూ దేవుళ్లు, దేవతల శాసనాలు కనిపిస్తాయి”అని శర్మ అన్నారు. జ్ఞాన్‌వాపి మసీదు వీడియో సర్వేపై కోర్టు నియమించిన స్పెషల్ అసిస్టెంట్ కమిషనర్ గురువారం వారణాసి కోర్టు ముందు నివేదికను సమర్పించిన అనంతరం.. ఈ కేసులో విచారణ ప్రారంభమైన తర్వాత బిజెపి నేత ఈ చర్యకు పాల్పడడం గమనార్హం. జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు చేసిన పిటిషన్‌పై పౌర న్యాయస్థానం వీడియో సర్వేను ఆదేశించింది.

ఇదిలా ఉండగా, వారణాసిలోని జ్ఞానవాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్‌లోని జ్ఞానవాపి మసీదు సమీపంలో సర్వే, వీడియోగ్రఫీ చేస్తున్న సమయంలో ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు బయటపడ్డాయి. అవి బాగా రంగు మారిపోయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ స్వస్తిక్ గుర్తులను చాలా యేళ్ల క్రితం చిత్రీకరించి ఉంటారని మసకబారినప్పటికీ స్వస్తిక్ గుర్తులు కనిపిస్తున్నాయని సర్వే అధికారులు తెలిపారు. అయితే అక్కడ నిరసనలు చెలరేగడంతో సర్వే ప్రక్రియ అర్దతరంగా నిలిపివేసినట్టుగా అధికారులు తెలిపారు. 

వివరాలు.. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన మహిళలు రాఖీసింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు తదితరులు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన వారణాసి జిల్లా కోర్టు వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించారు. మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖతో కలిసి వాస్తవాలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశంచింది. రంజాన్ తరువాత సర్వేను ప్రారంభించి.. ఈ నెల 10లోగా పూర్తి చేయాలని సూచించింది. ఈ క్రమంలో శుక్రవారం అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సర్వే బృందం శుక్రవారం ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టడంతో  అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios