Asianet News TeluguAsianet News Telugu

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేను బీజేపీ ఉపయోగించుకుంటోంది - శివ‌సేన ఎంపీ సంజయ్ రౌత్

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ను బీజేపీ ఉపయోగించుకుంటోందని శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎంఎన్ఎస్ అధినేత అయోధ్య పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

BJP is using MNS chief Raj Thackeray - Shiv Sena MP Sanjay Raut
Author
Mumbai, First Published May 20, 2022, 2:30 PM IST

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తన అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేప‌థ్యంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్ర‌వారం స్పందించారు. ఎంఎన్ఎస్ చీఫ్ ను త‌న రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న అర్థం చేసుకోవాల‌ని సూచించారు. 

ఆదిత్య ఠాక్రే అయోధ్య పర్యటన జూన్ 15వ తేదీన జరుగుతుందని సేన నాయకుడు సంజయ్ రౌత్ స్ప‌ష్టం చేశారు. ఆయన ఇస్కాన్ ఆలయాన్ని కూడా సందర్శిస్తారని రౌత్ తెలిపారు. ‘‘ అయోధ్యలో ఇతర పార్టీ (ఎంఎన్ఎస్) కొన్ని కార్యక్రమాలను రద్దు చేసిందని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఆయ‌నకు మేం అక్క‌డ స‌హ‌క‌రించేవాళ్లం. అయోధ్యలో శివసేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.’’ అని సంజయ్ రౌత్  ఆరోపించారు. 

Char Dham: య‌మునోత్రి హైవేపై విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. ఇరువైపుల చిక్కుకుపోయిన వేల‌మంది

‘‘ రాజ్ ఠాక్రేను బీజేపీ వాడుకుంటోది. కొంతమంది దీనిని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. కానీ ఈ విషయాన్ని ఆయ‌న పరిగణలోకి తీసుకోవాలి ’’ అని సూచించారు. రాముడి దర్శనం కోసం ఎవరైనా అయోధ్యకు వెళ్లవచ్చని సంజయ్ రౌత్ అన్నారు. ‘‘ మీరు కేవలం మీ హృదయంలో నమ్మకం కలిగి ఉండాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. రాజ్ ఠాక్రే తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎంపీ బ్రిజ్మోహన్ సింగ్ కొన్ని ప్రశ్నలు సంధించారు. బహుశా ఆయ‌న‌కు స‌మాధానం దొర‌క‌లేదు. అయితే జూన్ 15న ఆదిత్య ఠాక్రే పలువురు శివసైనికులతో కలిసి అయోధ్య దర్శనానికి వెళ్తున్నారు. తత్వశాస్త్రం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. దీనికి ముందు కూడా ఉద్ధవ్ ఆల‌యాన్ని సందర్శించారు. అది కొనసాగుతుంది. గుడి కోసం ఉద్యమం మొదలైనప్పటి నుంచి అయోధ్యతో శివసేనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ’’ అని ఆయన అన్నారు. 

గత కొంత కాలంగా కొనసాగుతున్న లౌడ్ స్పీకర్ల వివాదానికి తెరలేపిన వ్యక్తిగా ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే నిలిచారు. అయితే ఆయ‌న జూన్ 5వ తేదీన త‌న పార్టీ నాయ‌కులతో క‌లిసి అయోధ్యను సంద‌ర్శిస్తాన‌ని ఏప్రిల్ 17వ తేదీన పూణేలో ప్ర‌క‌టించారు. ‘‘ 'రామమందిరం కోసం ఎంతో మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ కృషి కార‌ణంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అవుతోంది. కాబట్టి నేను గుడి నిర్మాణం ప్రారంభ ద‌శ‌లో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఆలయం సిద్ధమైన తర్వాత ప్రతీ ఒక్కరూ మళ్లీ ఆలయాన్ని సందర్శిస్తారు ’’ అని అన్నారు. అయితే ఆయన అన్యూహంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 

India's first 5G call: స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో 5జీ టెస్ట్ కాల్ విజ‌య‌వంతం.. కేంద్రం ఏం చెప్పిందంటే..?

రాజ్ ఠాక్రే తన అయోధ్య పర్యటన రద్దుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ వాయిదాకు గ‌ల కార‌ణాల‌ను ఈ నెల 22వ తేదీన పూణేలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో చెబుతాన‌ని తెలిపారు. కాగా.. రాజ్ థాక్రే అయోధ్య‌ను సంద‌ర్శిస్తాన‌ని తెలిపిన నాటి నుంచి బీజేపీ నాయ‌కులు ప‌లు అభ్యంత‌రాలు తెలిపారు. ఉత్తర భారతీయులను అవమానించిన ఎంఎన్ఎస్ అధినేత‌ను అయోధ్యలోకి అనుమతించబోమని ఉత్తరప్రదేశ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తో పాటు మరికొందరు బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని ఉండొచ్చ‌ని సంజ‌య్ రౌత్ అనుమానం వ్య‌క్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios