Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్ల దోషి.. బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న కూతురి కోసం క్యాంపెయిన్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం నరోడా పాటియా నుంచి బీజేపీ పాయల్ కుక్రానిని అభ్యర్థిగా బరిలోకి దింపింది. నరోడా పాటియాలో సుమారు 97 మందిని ఊచకోత కోసిన కేసులో దోషిగా తేలిన మనోజ్ కుక్రాని కూతరే ఈ పాయల్. సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే తవానీని పక్కకు పెట్టి మరీ ఈమెకు టికెట్ ఇవ్వడం గమనార్హం.
 

bjp gives ticket to naroda patiya massacre convict daughter.. convict is campaigning for daughter
Author
First Published Nov 14, 2022, 2:10 AM IST

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ అల్లర్ల కేసులో దోషులుగా తేలిన వారికి సంబంధించిన వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఆ వివాదాలు కూడా బీజేపీ కేంద్రంగా సాగుతున్నాయి. గోద్రా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థిపై విమర్శలు వచ్చాయి. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పై అత్యాచారం చేసిన వారు కోర్టు ఆదేశాల మేరకు విడుదలైన సంగతి తెలిసిందే. వీరిని సంస్కార బ్రాహ్మణులు అని ప్రశంసించిన చంద్రసిన్హా రైల్జీకి బీజేపీ గోద్రా నుంచి టికెట్ ఇచ్చింది. తాజాగా, మరో వివాదం ముందుకు వచ్చింది. నరోడా పాటియా ఊచకోత కేసులో దోషిగా తేలిన మనోజ్ కుక్రాని కూతురు పాయల్ కుక్రానికి బీజేపీ టికెట్ ఇచ్చింది. పాయల్ కులకర్ణికి రాజకీయ అనుభవమే లేదు. దానికి తోడు.. పాయల్ కుక్రాని కోసం తండ్రి, గుజరాత్ అల్లర్ల దోషి మనోజ్ క్యాంపెయిన్ చేపట్టడం కలకలం రేపుతున్నది.

పాయల్ కులకర్ణి వృత్తిరీత్యా అనస్థీటిస్ట్. రాజకీయ అనుభవమేమీ లేదు. అయినప్పటికీ నరోడా పాటియా సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవానీకి బదులు పాయల్ కుక్రానికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇది గుజరాత్ అల్లర్లు చేసిన వారికి రివార్డు ఇచ్చే సంప్రదాయాన్ని బీజేపీ మొదలు పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కూతురు పాయల్ కుక్రానికి క్యాంపెయిన్ చేస్తున్న మనోజ్ కుక్రానిని ఎమ్మెల్యే తవానీ, బీజేపీ కార్యకర్తలు తమలో కలుపుకుని మరీ ప్రచారం చేస్తున్నారు.

2002 గుజరాత్ అల్లర్లలో నరోడా పాటియాలో 97 మందిని ఊచకోత కోసినట్టు 2012లో దోషులుగా తేలిన 32 మందిలో మనోజ్ కులకర్ణి ఉన్నారు. ఆయన కూతురును అదే నరోడా పాటియా నుంచి బీజేపీ అభ్యర్థిగా దించడంపై చాలా మంది షాక్‌కు గురవుతున్నారు.

తండ్రి గురించి పాయల్ కుక్రాని మాట్లాడుతూ, ‘నా తండ్రి అనుభవమున్న రాజకీయ నేత. నా తండ్రి దోషిగా తేలిన అంశంపై మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే, దీనిపై తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాం. ఇంకా దీనిపై పోరాడుతున్నాం. నేను మీకు చెప్పేదేమిటంటే.. నాకు నా తండ్రి, తల్లి, బీజేపీ నేతలు అందరూ మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికలో అభివృద్ధి అంశంపై నేనే గెలుస్తాను’ అని తెలిపారు. 

మనోజ్ సోదరుడు డాక్టర్ పురుషోత్తమ్ మాట్లాడుతూ, తన సోదరుడు తప్పుగా ఇందులో దోషిగా తేలాడని అన్నారు. ఆయన అప్పుడు కేవలం అక్కడ ఉన్నాడంతే అంటూ పేర్కొన్నారు. అయినా జరిగిపోయిన సంగతుల గురించి ప్రజలు పట్టించుకోరని, పబ్లిక్ ఇప్పుడు, మోడీజి, అభివృద్ధి గురించి మాత్రమే పట్టించుకుంటారని వివరించారు.

మనోజ్ కుక్రాని తొలి నుంచి ఎక్కువగా బెయిల్ పై బయటే ఉండేవాడని తెలుస్తున్నది. అయితే, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆయన బెయిల్ పైనే కంటిన్యూస్‌గా బయటే ఉంటున్నారు. 

పాయల్ అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష ఆప్ అభ్యర్థి ఓమ్ ప్రకాశ్ మాట్లాడుతూ, ‘నరోడా పాటియాలో ఊచకోతకు ప్రేరేపించి పార్టీకి విశేష కృషి చేశాడని బీజేపీ భావిస్తూ ఉండొచ్చు. జైలుకు వెళ్లి మరెంతో త్యాగం చేశాడని బీజేపీ అనుకుంటున్నదేమో. కాబట్టి, ఆయనకు కచ్చితంగా రివార్డు ఇవ్వాల్సిందే. అందుకే ఆయన భార్య ఒక బీజేపీ కార్పొరేటర్. ఇప్పుడు కూతురు పాయల్ ఎమ్మెల్యే అభ్యర్థి’ అంటూ విమర్శలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios