Asianet News TeluguAsianet News Telugu

Huzurabad bypoll Live Update: ముగిసిన పోలింగ్.. ఇంకా క్యూలో బారులు తీరిన ఓటర్లు

హుజురాబాద్ ఉపఎన్నికలో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ తీర్పును ఈవిఎం మిషన్లలో పొందుపరుస్తున్నారు. 

Huzurabad bypoll Live Update
Author
Huzurabad, First Published Oct 30, 2021, 7:01 AM IST

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుున్నారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో వున్న వారికి కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. దీంతో ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది. 

హుజురాబాద్‌లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు తరలివస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కమలాపూర్ మండలం గూడూరులో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. అంతేకాదు దొరికిన డబ్బును చూపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌లో భాగంగా జమ్మికుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పీఏలు పోలింగ్ బూత్‌ల వద్ద డబ్బు పంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే పీఏలను చితకబాదారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలకు పాల్పడ్డారు. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,08,082 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని, ఇప్పటి వరకు 63 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తాజాగా.. పోలింగ్ కేంద్రాలను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని శశాంక్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలకు పాల్పడ్డ వారిపై కేసులు పెట్టామని.. కొన్నిచోట్ల డబ్బు పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయని శశాంక్ గోయల్ తెలిపారు. 

 

"

 

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ  సందర్భంగా బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇల్లందుకుంటలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. అక్కడి ఓటర్లు, అధికారులతో ఆయన ముచ్చటించారు. 

 

"

 

హుజురాబాద్ ఉపఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను భారీగా తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

హుజురాబాద్ పట్టణంలో డబ్బు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు పట్టుకున్నారు. స్ధానిక ఆంజనేయ ఆలయం వద్ద డబ్బులు పంచుతున్నట్లుగా తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అయితే అతను నాన్ లోకల్‌ అని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

హుజురాబాద్ ఉపఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను భారీగా తరలివస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నాటికి 46 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, గెల్లు సతీమణి శ్వేత కు మధ్య వాగ్వివాదం జరిగింది. నాన్ లోకల్ వాళ్ళకు ఇక్కడేం పని అంటూ ఉమను శ్వేత నిలదీసారు. ఈ క్రమంలోనే బిజెపి, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. 


జమ్మికుంట 28వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటివద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ధర్నా చేస్తున్నట్లు తెలిసి సిపి సత్యనారాయణ చేరుకున్నారు. ఇంట్లో వున్న ముగ్గురు నాన్ లోకల్ టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంట్లో లేరని తేల్చారు సిపి.

హుజురాబాద్ నియోజకవర్గంలో మండలాలవారిగా పోలింగ్ శాతం

జమ్మింకుంట 45.36

వీణవంక 47.65

హుజురాబాద్ 45.05

ఇల్లంతకుంట 42.09

కమలాపూర్ 46.76
 

మరిపెల్లిగూడెంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసారు. అంతేకాకుండా ఈటల పీఆర్వో చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హుజురాబాద్ లో ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. మద్యాహ్నం ఒంటిగంట వరకు 45.63శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆరు గంటల్లోనే నియోజకవర్గంలోని దాదాపు సగం మంది ఓటర్లు ఓటేశారన్నమాట. 

Huzurabad bypoll Live Update

హిమ్మత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్-బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ఎన్నికల పరిశీలను వెళ్లగా ఆమెను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. నాన్ లోకల్స్ కు ఇక్కడేం పని అంటు ఆమెను అడ్డుకున్నారు.  

ఓటేసేందుకు వెళ్లేముందు సిలిండర్ కు దండం పెడుతున్న గెల్లు శ్రీనివాస్ 

Huzurabad bypoll Live Update

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ పార్టీ, వి6 న్యూస్, రాజ్ న్యూస్ ఛానెల్ పై టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటేసిన తర్వాత ఈటల రాజేందర్  మీడియాతో మాట్లాడటం, కార్యకర్తలు ప్రచారం చేయడం అంశాలపై మెయిల్ ద్వారా ఈసీఐ కి ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియా సమావేశంను లైవ్ టెలికాస్ట్ చేసినందుకు వీ6, రాజ్ న్యూస్ ఛానెల్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది టీఆర్ఎస్ పార్టీ.

హుజూరాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజిలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో కరినగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి అయన సతీమణి రాణి  ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Huzurabad bypoll Live Update

వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో  టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి బయలుదేరిన గెల్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Huzurabad bypoll Live Update

కమలాపూర్ లో ఓటు వేసిన అనంతరం ఈటల రాజేందర్ దంపతులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసారని... దాన్ని కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలా ప్రసారం చేస్తున్న మూడు చానళ్లపై ఈసికి, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్ నాయకులు సిద్దమయ్యారు. 

టీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వున్న తాను నియోజకవర్గంలోని 305 పోలింగ్ స్టేషన్ల లోకి వెళ్లే అధికారం వుంటుందని... అలాంటిది తనను బిజెపి శ్రేణులు ఫ్రస్ట్రేషన్‌తోనే అడ్డుకుంటున్నారని టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. లన వెనుక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేకపోయినా అడ్డుకున్నారని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూల మీడియా సంస్థకు చెందిన ఓ రిపోర్టర్ డబ్బులు పంపిణి చేస్తున్నారంటూ బిజేపి నాయకులు అడ్డుకున్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపిని డిమాండ్ చేసారు. 

హుజురాబాద్ ఎన్నికల్లో పంచడానికి టీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులను జమ్మికుంట మున్సిపాలిటీ 28వార్డు కౌన్సిలర్ దీప్తి ఇంట్లో దాచిందని బిజెపి ఆరోపిస్తోంది. వెంటనే ఆమె ఇంటిపై దాడిచేసి ఓటర్లను ప్రలోభపెట్టడానికి దాచిన డబ్బును స్వాదీనం చేసుకోవాలంటూ బిజెపి శ్రేణులు ధర్నాకు దిగాయి. కౌన్సిలర్ ఎంటి ఎదుట ఆందోళనకు దిగారు. 

హుజురాబాద్ ప్రజలు ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉదయం ఏడుగంటల నుండి 11గంటలవరకు అంటే నాలుగు గంటల్లోనే 33శాతం పోలింగ్ నమోదయ్యింది. 

వీణవంక మండలంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బిజెపి,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గొడవకు దిగిన టిఆర్ఎస్, బిజెపి నేతలపై కేసులు నమోదు చేస్తామని సిపి సత్యనారాయణ తెలిపారు.

హుజరాబాద్ లోని ఇందిరా నగర్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఓటర్లు, పోలింగ్ సిబ్బందిని అడిగి పోలింగ్ సరళి గురించి తెలుసుకున్నారు.  

"

గణుముక్కలలో టీఆర్ఎస్, బిజెపి వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసకుంది. టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని బిజెపి కార్యకర్తలు విమర్శిస్తున్నారు. బిజెపి నాయకుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డితో బిజెపి నాయకులు వాగ్వివాదానికి దిగారు.

ఇల్లంతకుంట మండలం మల్లాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బులు పంచుతున్నారంటూ ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు చితకొట్టారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటికే బిజెపి అభ్యర్థి  సతీసమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన కమలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకొన్నారు ఈటల రాజేందర్, ఈటల జమున ఓటేసారు. 

Huzurabad bypoll Live Update

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా వీణవంక మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్కల్ లో బిజెపి, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. 

హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు బిసి కమీషన్ ఛైర్మెన్ వకులభరణం కృష్ణమోహన్ రావు.

హుజురాబాద్ లో ఉదయం ఏడుగంటలకే పోలింగ్ ప్రారంభమయ్యింది. రెండుగంటల తర్వాత అంటే ఉదయం 9గంటల వరకు 10.5శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

హుజురాబాద్ ఉపఎన్నికలో భాగంగా జరుగుతున్న పోలింగ్ ను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ అధికారులు, ఓటర్లతో మాట్లాడి పోలింగ్ జరుగుతున్న విదానాన్ని పరిశీలించారు. 

Huzurabad bypoll Live Update

Huzurabad bypoll Live Update

 ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో తమకు డబ్బులు ఇవ్వడం లేదని సర్పంచ్ ఇంటిముందు గ్రామస్తులు ధర్నాకు దిగారు.

వీణవంక మండలకేంద్రంలోని సెకండరీ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమీషన్ సత్యనారాయణ సందర్శించారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సిపి తెలిపారు. 

హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలింగ్ బూత్ మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి నుఈటల రాజేందర్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈటల విజ్ఞప్తి చేశారు.

హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గుండెడు గ్రామంలో కొందరు మహిళలు టీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు గ్యాస్ సిలిండర్ కి దండంపెట్టి ఓటు వేయడానికి బయలుదేరారు. సిలిండర్ ధరను పెంచిన బిజెపి వ్యతిరేకంగా ఇలా సిలిండర్ కు దండంపెట్టి టీఆర్ఎస్ కు ఓటేయడానికి కదలాలని మంత్రి హరీష్ తో పాటు మిగతా నాయకులు జోరుగా ప్రచారం చేసారు. 

Huzurabad bypoll Live UpdateHuzurabad bypoll Live Update

Huzurabad bypoll Live UpdateHuzurabad bypoll Live Update

ఇల్లంతకుంటలోని పోలింగ్ బూత్ లో ఈవిఎంలో సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో పోలింగ్ ప్రారంభమయ్యింది. 

అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్ధులు పోలింగ్ స్టేషన్ల వద్ద పరిశీలనకు వెళ్లిన సమయంలో ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ అభ్యర్ధుల పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. 

కమలాపూర్‌ లో 262 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు తారుమారయ్యాయి. దీంతో ఓటేసేందుకు ఓటర్లు  తికమకపడాల్సి వచ్చింది. దీంతో అధికారులు వెంటనే సమస్యను గుర్తించి సరిచేసారు.

హుజురాబాద్ లో ఉదయం నుండే ఓటేసేందుకు పోలింగ్ స్టేషన్లకు ప్రజలు కదిలారు. చలిని కూడా లెక్కచేయకుండా వృద్దులు సైతం ఓటేయడానికి కదిలి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

జమ్మికుంట మండలకేంద్రంలోని మండల పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమయ్యింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపద్యంలో కమలపూర్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మాజి మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయన సతీమణి జమున. వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకొనున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు ఇక్కడ ఓటు లేదు, 

ఇల్లంతకుంటలోని 224 పోలింగ్ బూత్ లొ ఇంకా పోలింగ్ ప్రారంభంకాలేదు. సాంకేతిక కారణాలతో ఈవిఎంలు మొరాయిస్తుండటంతో పోలింగ్ ప్రారంభంకాలేదు. దీంతో ఓటేయడానికి ఉదయమే పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చిన ఓటర్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వుంది. 

హుజరాబాద్ నియోజకవర్గంలో  పోలింగ్ బూతుల్లో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ని స్టార్ట్ చేసారు అధికారులు. విధుల్లో భాగంగా ఈసీ ఆదేశాలను పాటిస్తూ అధికారులు కోవిడ్ అంచనాలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్స్ కోసం తగు ఏర్పాట్లు చేశారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇందుకోసం ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లన్ని పూర్తి చేసింది. పోలింగ్ కోసం నియోజకవర్గంలో నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులు1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనాలు అనుసరించి నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ ఇప్పటికే తెలిపారు. ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించనున్నారు. మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.  

పోలింగ్ కేంద్రం నకి వచ్చే ప్రతి ఓటరు సానిటైజ్ చేసుకొనేలా ఏర్పాటు చేసారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్స్ థర్మమీటర్ తో టెంపరేచర్ ని పరీక్షించి లోపలికి పంపుతున్నారు. .ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ పేషెంట్ లకి ప్రత్యేక పిపిఈ కిట్లు చెతికి గ్లౌజులు సిద్దంగా ఉంచారు. సోషల్ మిడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని ప్రజలు శాంతియుత వాతావరణం లో ఓటు హక్కు,స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. 3880 మంది పోలిసులతో పటిష్ఠమైన బందోభస్తుని ఏర్పాటు చేసారు. 

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు. ప్రధానంగా పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే నెలకొన్నప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు విజేతను నిర్దేశించనున్నాయి..!
 

Follow Us:
Download App:
  • android
  • ios