Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలు.. నేతల కొడుకులకు టికెట్లు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వారసత్వ రాజకీయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కనీసం 20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు సీనియర్ నేతల కొడుకులను బరిలోకి దింపుతున్నారు. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ సీట్లే ఉన్నాయి.
 

bjp congress fields dynasts of senior leaders in gujarat assembly election contest
Author
First Published Nov 21, 2022, 4:23 PM IST

అహ్మదాబాద్: వారసత్వ రాజకీయాలకు ఏ పార్టీ అతీతంగా ఉండటం లేదు. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే.. ఈ విషయం స్పష్టమవుతుంది. పార్టీలు కేటాయించే టికెట్లు వారసత్వ రాజకీయాలను వెల్లడిస్తాయి. బీజేపీ ఈ సంస్కృతిని బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. కానీ, ఆ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలు చేస్తున్నట్టు ఈ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

182 స్థానాలు గల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు వారసులకు టికెట్లు ఇచ్చాయి. అయితే, ఇందులో ఎక్కువ సంఖ్య కాంగ్రెస్‌వే. బీజేపీ ఏడు స్థానాల్లో వారసులకు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్ అందుకు దాదాపు రెట్టింపు సంఖ్యగా 13 స్థానాల్లో వారసులకు పార్టీ టికెట్లు ఇచ్చింది. 

రాజకీయ విశ్లేషకుల ప్రకారం, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆ నియోజకవర్గంలో మరో ప్రత్యామ్నాయం లేకపోవడం ప్రధానంగా ఈ సంస్కృతి కొనసాగడానికి కారణం అవుతున్నాయి.

పది సార్లు గెలిచిన ట్రైబల్ లీడర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మోహన్ సిన్హ రాథ్వా పార్టీ నుంచి సంబంధాలను తెంపుకుని బీజేపీలోకి గత నెల చేరారు. ఆయన కొడుకు రాజేంద్రసిన్హ రాథ్వాకు చోటా ఉదేపూర్ సీటు నుంచి టికెట్‌తో బీజేపీ రివార్డు ఇచ్చింది. ఇదే స్థఆనం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి సంగర్ామసిన్హ రాథ్వా కొడుుకు నరనన్ రాథ్వా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారిగా తలపడుతున్నారు.

Also Read: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. ఏడుగురు రెబల్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ..

సనంద్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కాను పటేల్.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కరన్ సిన్హ పటేల్ కొడుకు. ఆయన 2017లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ కాను పటేల్‌కు మరోసారి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్ పై రెండు సార్లు గెలిచిన రామసిన్హా పర్మార్ 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయన కొడుకు యోగేంద్ర పర్మార్ ను బీజేపీ థాస్రా సీటులో దింపింది.

మాజీ ఎమ్మెల్యే మనుభాయ్ పర్మార్ కొడుకు శైలేష్ పర్మార్ అహ్మబాద్‌కు చెందిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ మరోసారి ఆయనకే దానిలిండా నుంచి టికెట్ ఇచ్చింది. ఇదే తరహాలో మాజీ సీఎం శంకర్ సిన్హా వాఘేలా కొడుకు మహేంద్ర సిన్హా వాఘేలా కూడా మళ్లీ బరిలోకి దిగారు.

మాజీ సీఎం అమర్ సిన్హా చౌదరి కొడుకు తుషార్ చౌదరిని కాంగ్రెస్ బర్దోలి నుంచి పోటీలో నిలిపింది.  ఇంచుమించు ఇలాంటి చరిత్ర కలిగిన నేతలు, వారి కొడుకులు బరిలో నిలబడ్డారు.

అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయాలే తమ వారసత్వంగా కొనసాగిస్తున్న కుటుంబాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీందర్ త్రివేది తెలిపారు. అలాంటి కుటుంబాలు గట్టి ప్రాబల్యాన్ని కలిగి ఉంటాయని, ఎన్నికల సరళిని మొత్తంగా మార్చివేసే శక్తి వాటికి ఉంటాయని వివరించారు. అలాంటి నేతలకు ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థులు పార్టీలకు కనిపించరు. అలాంటి సమయాల్లో ఆ నేత కొడుకుకు లేదా వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఇస్తుంటాయని తెలిపారు. కొన్నిసార్లు ఒక నేత ఇన్‌ఫ్లుయెన్స్ ముందు మరే ఇతర పార్టీల నేతలు నిలబడినా దండగే అనే పరిస్థితులు కూడా ఉన్నాయని వివరించారు. అలాంటి వారు పార్టీలు తమకే టికెట్ ఇచ్చేలా నియంత్రించుకోగలరు. ఎందుకంటే పార్టీలకు మరో అవకాశం లేకుండా ఉంటుంది. ఒకవేళ వారిని మార్చాలన్నా.. అది వారి కొడుకు, భార్య, కూతుళ్లతో భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios