JP Nadda: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

JP Nadda: రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న G-20 సమ్మిట్ విందుకు ఆహ్వానం 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో పంపడంపై రాజకీయ దుమారం చెలరేగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రతిపక్ష పార్టీలు ముఖాముఖిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్ పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో రాజ్యాంగ ప్రవేశిక వ్రాయబడింది. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదిక ఆయన మాట్లాడుతూ.. "భారతదేశ ప్రవేశిక కూడా తెలియని పార్టీ నుండి మనం ఏదైనా ఆశించగలమా? కాంగ్రెస్‌కు భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ పట్ల గౌరవం లేదు. ఇది అవమానకరం!"అని విమర్శలు గుప్పించారు.

'దేశ గౌరవంపై కాంగ్రెస్ సమస్య ఏంటీ?'

అంతకుముందు మంగళవారం నాడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. “దేశ గౌరవం, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరం? అని ప్రశ్నించారు. 
భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసే వారు ‘భారత్’ ప్రకటనను ద్వేషిస్తారన్నారు. కాంగ్రెస్‌కు దేశంపైనా గానీ, దేశ రాజ్యాంగంపైనా గానీ, రాజ్యాంగ సంస్థలపైనా గానీ గౌరవం లేదని స్పష్టమవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసునని ఆరోపించారు. 

రాష్ట్రాల సమాఖ్యతపై దాడి - జైరాం రమేష్

అదే సమయంలో.. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారనీ, ఇండియా అంటే.. రాష్ట్రాల యూనియన్ ను విభజించడాన్ని కొనసాగించవచ్చునని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. భారతదేశం, రాష్ట్రాల యూనియన్ అని చెబుతుంది, కానీ ఇప్పుడు ఈ 'యూనియన్ ఆఫ్ స్టేట్స్' పై దాడి జరుగుతోందని అన్నారు.