Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అభివృద్ధి నమూనాను తెలుసుకునేందుకే బీజేపీ ఛత్తీస్‌గఢ్‌కు వ‌చ్చింది - సీఎం భూపేష్ బఘేల్

కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో చేసిన అభివృద్ధిని చూసేందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తమ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. కాంగ్రెస్ రాజవంశాల పార్టీ కాదని, బీజేపీయే అసలైన రాజవంశ పార్టీ అని ఆరోపించారు. 

BJP came to Chhattisgarh to learn Congress development model - CM Bhupesh Baghel
Author
First Published Sep 10, 2022, 2:31 PM IST

బీజేపీపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయడానికి ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించారని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. “ మా రాష్ట్ర నమూనాను తెలుసుకోవడానికి బీజేపీ ఇక్క‌డికి వ‌చ్చింది. మా ప్రణాళికలను కేంద్రం ఆమోదించింది. బీజేపీ ఒంటరిగా పోరాడదు, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను కూడా ఉపయోగించుకుంటుంది. ’’ అని తెలిపారు. 

సోనూసూద్ : అభిమాని చేసిన పనికి షాక్ అయిన రియల్ హీరో.. అలా చేయద్దంటూ హితవు...

రాజవంశ రాజకీయాలు అంటూ కాంగ్రెస్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై భూపేష్ బాఘేల్ స్పందించారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని, దేశ నిర్మాణంలో వారి గొప్ప సహకారం ఉందని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలతో బీజేపీనే పీడిస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు. ‘‘ ఆయ‌న కుటుంబ వాదం గురించి ఖచ్చితంగా చెప్పారు. బస్తర్‌కు చెందిన దివంగత బీజేపీ నాయకుడు బలిరామ్ కశ్యప్ కుమారులు దినేష్ కశ్యప్ (మాజీ ఎంపీ), కేదార్ కశ్యప్ (మాజీ ఎమ్మెల్యే, మంత్రి), మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్  అతడి కుమారుడు మాజీ ఎంపీ అభిషేక్ సింగ్ బీజేపీలోని రాజవంశాలకు ఉదాహరణలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారి స్థానంలో రాజ్‌నాథ్ సింగ్ ఆయ‌న కుమారుడు, అమిత్ షా కుమారుడు, వసుంధర రాజే సింధియా ఆమె కుమారుడు, మేనల్లుడు ఉన్నారు ’’ అని తెలిపారు. 

ఢిల్లీలోని కొత్త సెక్రటేరియట్ భవనంపై కూడా బాఘేల్ వ్యాఖ్యానించారు. ‘‘ వారు (బీజేపీ) 1000 కోట్లు ఖర్చు చేసి అగ్గిపెట్టెను పోలిన సచివాలయాన్ని తయారు చేశారు. దీని కిటికీలు గాలి ప్రవహించే ప్రతిసారీ గిలగిలలాడుతున్నాయి ’’ అని అన్నారు. 

భార‌త్ జోడో యాత్రలో మ‌రో వివాదం.. పాస్ట‌ర్ల‌లో రాహుల్ భేటీ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అంతకుముందు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుక్రవారం ఉదయం రాయ్పూర్కు చేరుకున్నారు. ఒక సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, 'మా పోరాటం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది' అని అన్నారు. 'కాంగ్రెస్ పార్టీ సోదర సోదరీమణుల పార్టీ. ఈ రోజుల్లో, ముఖ్యమంత్రి భగేల్ 'భారత్ జోడో' ర్యాలీలకు వెళుతున్నారు, వారు మొదట తమ సొంత పార్టీని సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా పోరాటం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది' అని ఆయన అన్నారు.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గురువారం ప్రారంభమైన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ఐదు నెలల్లో 3,570 కిలోమీటర్ల పాటు సాగి కాశ్మీర్ కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో నడ్డా ఛత్తీస్ ఘ‌డ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటి ర్యాలీలో రాహుల్ గాంధీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఉపాధిపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

యువ‌త‌లో 42 శాతం నిరుద్యోగులు.. దేశ‌ భవిష్యత్తు భద్రమేనా? : కేంద్రం పై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు

‘‘ మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని కోసం భారత్ ఇప్పుడు విజన్ దివాళాకోరుతనాన్ని ఎదుర్కొంటోంది. మేము భారీ గుత్తాధిపత్యాల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నాము. మేము అన్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాము. ఆ పార్టీ రైతులకు లేదా ఎమ్ఎస్ఎమ్ఈలకు వ్యతిరేకంగా ఉంటుంది. ’’ అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios