ఈ నెల 23న విపక్షాల సమావేశం బిహార్‌లోని పాట్నాలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు? అని బీజేపీ ప్రశ్నించింది. కాగా, విపక్ష పార్టీల నేతలు అందుకు సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాలు మెగా మీటింగ్ నిర్వహించనున్నాయి. ఈ భేటీలో ప్రతిపక్ష ఐక్యకూటమికి ప్రాతిపదిక, ఫార్ములాను రూపొందించనున్నాయి. ఈ సమావేశం జరగనున్న సందర్భంలో బీజేపీ కీలక ప్రశ్న వేసింది. ప్రతిపక్షాలు కలిసే అవకాశాలు చాలా తక్కువ అని పేర్కొంది. కనీసం ఆ పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలుపలేనంత అపనమ్మకంలో ఆ పార్టీలు ఉన్నాయని బీజేపీ సీనియర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు విపక్ష నేతలు స్పందించారు.
కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. మెజార్టీ ఉన్న పార్టీ దాని మిత్రపక్షాలకు చెందిన ఓ నేత నైనా ఎన్నుకోవచ్చు అని వివరించారు. దీని గురించి వారికి ఎందుకు బెంగ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. 2021లో కేంద్ర క్యాబినెట్ నుంచి అనర్హతకు గురైన వ్యక్తి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. ‘నీకు చేతనైంతగా ప్రయత్నించినా.. నిన్ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోరు’ అని వివరించారు.
ప్రధాని అభ్యర్థి విషయం గురించి స్పందిస్తూ ‘ముందుగా మేం ప్రజా సమస్యలపై, కామన్ సమస్యలపై, కామన్ ఎజెండా గురించి చర్చిస్తామని వివరించారు. తమ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మీకు తెలియజేస్తాం. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా వివరిస్తాం. కొంత ఓపిక పట్టండి’ అని వివరించారు.
Also Read: విపక్షాల ఐక్యత కార్యరూపం దాల్చేనా?.. ఆ పార్టీలకు రాష్ట్రాలనే వదిలిపెట్టాలా?.. డైలామాలో కాంగ్రెస్!
ఆదివారం రవిశంకర్ ప్రసాద్ విపక్ష కూటమి ప్రయత్నాలపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష ఐక్య కూటమిలోకి కేవలం స్వార్థపరులు, అధికారంపై యావ ఉన్నవారు మాత్రమే వెళ్లుతారు అని విమర్శించారు. సీపీఎంతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే విపక్ష కూటమికి తాము మద్దతు ఇవ్వబోమని మమతా బెనర్జీ చెప్పిందని గుర్తు చేశారు. ఇది కేవలం మోడీ వ్యతిరేకత కూటమి అని పేర్కొన్నారు. వారు స్వయంగా ఏమీ చేయలేరని అన్నారు. దేవే గౌడ, ఐకే గుజ్రాల్, వీపీ సింగ్ (గతంలో కంద్రంలో పలు పార్టీల కూమిటో ఏర్పడిన కూటమి. ఆ కూటమి ప్రభుత్వానికి వీరు ప్రధానమంత్రులుగా వ్యవహరించారు.) కుభారత్ ఒక స్థిరమైన ప్రభుత్వం అవసరం. అంతేకానీ, వారిలో వారు కలహాలు పడే ప్రభుత్వం అవసరం లేదు. బిహార్ వారి వెంట వెళ్లదు, మిగిలిన దేశం కూడా ఆ విపక్ష కూటమి వైపు వెళ్లే అవకాశమే లేదు’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు.
టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందిస్తూ.. ఆ వ్యక్తి ముఖ్యం కాదు అని అన్నారు. ఆయన సొంత పార్టీ నే క్యాబినెట్ నుంచి దించేసిందని చురకలు అంటించారు. మోడీ ప్రభుత్వం స్వార్థపూరి తమైనది, మతోన్మాదం, సంకుచిత మనస్తత్వం కల ప్రభుత్వం అని, అదానీపై ఆధారపడే ప్రభుత్వం అని టీఎంసీ నేత రాయ్ విమర్శించారు. అన్ని కళ్లు ఇప్పుడు పాట్నా సమావేశం పైనే ఉన్నది.
