చైనా సైన్యం భారత భూమిని ఆక్రమించిందని స్థానికులు అంటున్నారని, కానీ, ప్రధాని మోడీ మాత్రం ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ బదులిచ్చింది. 1962 యుద్ధానికి ముందు, తర్వాత భారత్‌లో ఎంత భూమిని చైనా స్వాధీనం చేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
'భారత భూమిభాగాన్ని చైనా ఆక్రమించుకుంది' అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ గాంధీ పాంగాంగ్ సరస్సును సందర్శించాలని బీజేపీ సూచించింది. బీజేపీ తరపున కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ.. చైనా చేతిలో ప్రచార యంత్రంగా ఎందుకు మారుతున్నావు? మీ అమ్మ సోనియా గాంధీతో మీరు చైనాలో ఎక్కడికి వెళ్లారో చెప్పండి? రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా భారతదేశాన్ని పరువు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రాహుల్ అలవాటుగా మార్చుకున్నారని, గాల్వాన్‌లోని వీర జవాన్లను రాహుల్ గాంధీ అవమానపరుస్తున్నారని ఆరోపించారు.
నెహ్రూ హయాంలోనే చైనా అక్రమణ - బీజేపీ
బాలాకోట్ వైమానిక దాడులపై రాహుల్ గాంధీ ఆధారాలు అడుగుతున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మీ ముత్తాత నెహ్రూ హయాంలో 1962కి ముందు, తర్వాత చైనా ఎంత భూమిని లాక్కుందో గుర్తుందా? దలైలామాకు ఏమి జరిగిందో గుర్తుందా? చైనాకు వెళ్లిన భూమి అక్కడ గడ్డి కూడా పెరగదని నెహ్రూ అన్నారు. అరుణాచల్ నుంచి లడఖ్ వరకు ఉన్న సరిహద్దులో చైనాను ఇబ్బంది పెడుతుందని మీ ప్రభుత్వం వంతెన, కల్వర్టు ఇన్‌ఫ్రాలను నిర్మించలేదు.
సైన్యాన్ని నిరుత్సాహపరచవద్దని రాహుల్ గాంధీకి సూచించారు.మోదీ ప్రభుత్వం లడఖ్ కోసం అంకిత భావంతో పనిచేస్తుందని అన్నారు. లడఖ్ ప్రజల సమస్య ఏదైనా ఉంటే పరిష్కరిస్తామన్నారు. త్వరలో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ గాంధీ తుక్డే తుక్డే ముఠా సభ్యులతో కలిసి జీవిస్తున్నారని అన్నారు. ఎక్కడికెళ్లినా బీజేపీని విమర్శించాలనే రాహుల్ గాంధీ ఎజెండా పెట్టుకుంటాడని ఆరోపించారు.
ఇంతకీ రాహుల్ ఏమన్నారు?
ప్రస్తుతం రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం నాడు తన తండ్రి రాజీవ్ గాంధీ నివాళి సభకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్.. తమ భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని, ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి వీల్లేదని ఇక్కడి ప్రజలు చెప్పారని అన్నారు. మా భూమిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేదని ప్రధాని చెబుతున్నారు. ద్రవ్యోల్బణంతో లడఖ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాహుల్ గాంధీ ప్రధాని మోడీని విమర్శించారు. లడఖ్‌కు హోదా ఇవ్వడంతో ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన చెబుతున్నారు.
