ముంబై వాసులకు బంపర్ ఆఫరిచ్చిన  రాజ్ ఠాక్రే


ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్‌ ఠాక్రే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబై వాసులకు రాజ్ ఠాక్రే బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. గురువారం నాడు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో రూ. 9 తక్కువధరకే ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ ను విక్రయిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మహారాష్ట్రలోని 48 పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధరను రూ.9 తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన తరుణంలో ప్రజలకు నవ నిర్మాణ సేన ఈ ఆఫర్ ను ప్రకటించింది. 

ముంబైలో 36 పెట్రోల్ స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో 12 చోట్ల ఈ అవకాశం కల్పించింది. అయితే, ఈ తగ్గింపు కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం చేసింది. లీటర్ కు రూ. 9 తగ్గించి వాహనదారులకు పెట్రోల్ విక్రయాలు జరపడం వల్ల ఈ రోజు ఒక్కో బంక్ కు వచ్చే నష్టాన్ని నవ నిర్మాణ సేన చెల్లించనుంది.