హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat), ఆయన సతీమణి మధులిక భౌతికకాయాలకు పలువరు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు (pay tribute). ఢిల్లీలోని రావత్ నివాసానికి చేరుకుని అంజలి ఘటిస్తున్నారు. 

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat), ఆయన సతీమణి మధులిక భౌతికకాయాలకు పలువరు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు (pay tribute). ఢిల్లీలోని రావత్ నివాసానికి చేరుకుని అంజలి ఘటిస్తున్నారు. ఈ ఉదయం రావత్ దంపతుల భౌతికకాయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. రావత్ కుటుంబ సభ్యులను అమిత్ షా ఓదార్చారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (rahul gandhi), మల్లికార్లున ఖర్గే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.

నివాళులర్పించిన రావత్ కూతుళ్లు..
బిపిన్ రావత్, మధులిక రావత్‌ల భౌతికకాయాలకు వారి కూతుళ్లు (Bipin Rawat daughters) క్రితిక, తరిణి నివాళులర్పించారు. భౌతికకాయాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా రావత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. 

Also Read: బ్రిగేడియర్ లిడ్డర్ అంతిమసంస్కారాలు చేసిన కూతురు.. కన్నీటి ముద్దుతో వీడ్కోలు...

దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ ఆక‌స్మిక మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. జనరల్ బిపిన్ రావత్​, మధులికా రావత్​ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రావత్‌ దంపతులఅంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ అంతిమ యాత్ర‌.. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు సాగుతోంది. సైనిక లాంఛనాలతో బిపిన్‌రావత్‌ దంపతుల అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రావ‌త్ అంతక్రియ‌ల‌కు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులుహాజరు కానున్నారు.

బ్రిగేడియర్ లిడ్డర్ అంతిమసంస్కారాలు చేసిన కూతురు..
రావత్‌ దంపతులతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన Brigadier LS Lidder అంత్యక్రియలు ముగిశాయి. Delhi Cantonment లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుమార్తె అస్నా తండ్రికి దహనసంస్కారాలు నిర్వహించారు. తండ్రి ఇక లేరన్న బాధను గుండెల్లోనే దిగమింగుకుని ఎంతో ధైర్యంతో Cremation ceremonies నిర్వహించారు. 

తండ్రి పార్థివ దేహానికి చివరిసారిగా కన్నీటితో ముద్దు పెట్టుకుంటున్న ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలించింది. కలిచివేసింది. ఇక లిడ్డర్ పార్థివ దేహంమీద కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. భర్త చివరి గుర్తుగా మిగిలిన ఆ పతాకాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు లిడ్డర్ సతీమణి.