Asianet News TeluguAsianet News Telugu

Army Chopper Crash Funeral : బ్రిగేడియర్ లిడ్డర్ అంతిమసంస్కారాలు చేసిన కూతురు.. కన్నీటి ముద్దుతో వీడ్కోలు...

తండ్రి పార్థివ దేహానికి చివరిసారిగా కన్నీటితో ముద్దు పెట్టుకుంటున్న ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలించింది. కలిచివేసింది. ఇక లిడ్డర్ పార్థివ దేహంమీద కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. భర్త చివరి గుర్తుగా మిగిలిన ఆ పతాకాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు లిడ్డర్ సతీమణి. 

IAF Helicopter Crash: Brigadier LS Lidder laid to rest with full military honours
Author
Hyderabad, First Published Dec 10, 2021, 12:35 PM IST

ఢిల్లీ : Brigadier LS Lidder అంత్యక్రియలు ముగిశాయి. Delhi Cantonment లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుమార్తె అస్నా తండ్రికి దహనసంస్కారాలు నిర్వహించారు. తండ్రి ఇక లేరన్న బాధను గుండెల్లోనే దిగమింగుకుని ఎంతో ధైర్యంతో Cremation ceremonies నిర్వహించారు. 

తండ్రి పార్థివ దేహానికి చివరిసారిగా కన్నీటితో ముద్దు పెట్టుకుంటున్న ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలించింది. కలిచివేసింది. ఇక లిడ్డర్ పార్థివ దేహంమీద కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. భర్త చివరి గుర్తుగా మిగిలిన ఆ పతాకాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు లిడ్డర్ సతీమణి. 

సీడీఎస్ జనరల్ Bipin Rawat కు సహాయక సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్. హర్యానా పంచకుల ప్రాంతానికి చెందిన లిడ్డర్ గతంలో కశ్మీర్ లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్ కు నేతృత్వం వహించారు. అలాగే chinaతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్ కు నేతృత్వంలో వహించారు. కజకిస్తాన్ లో భారత Military teamలో పనిచేశారు. 

Bipin Rawat : ప్రమాదం తరువాత రావత్ బతికే ఉన్నారు.. చివరగా ఏమడిగారో తెలిస్తే కన్నీరాగదు..

కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న General Bipin Rawat తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సతర్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు. 

తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్ స్థానిక కాంట్రాక్టర్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్ దంపతులు సహా 13 మందిని బలిగొన్న Helicopter crashకి ఆయన ప్రత్యక్ష సాక్షి. ‘వేరే పని కోసం నేను రోడ్డు మీద నడిచి వెళుతుండగా.. పలువురు హెలికాప్టర్ కూలిందని కేకలు పెట్టారు.

General Bipin Rawat's helicopter crash: ఆర్మీ చాఫ‌ర్ ప్ర‌మాదానికి కారణం ఇదేనా ? శాస్త్రీయ వివ‌ర‌ణ‌..!

వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్లాను. చెట్టును ఢీ కొన్న హెలికాప్టర్ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొన ప్రాణాలతో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, తాగడానికి water ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్లలేకపోయాను. ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఆయనను, మరొకరిని దుప్పట్లలో చుట్టి అక్కడినుంచి తీసుకుపోయాయి.  ఆ తరువాత తెలిసింది. ఆయనే బిపిన్ రావత్’ అని shiva kumar పేర్కొన్నారు.

కాగా, బిపిన్ రావత్ చివరి క్షణాల్లో హిందీలో మాట్లాడారని, ‘నేనే బిపిన్ రావత్’ని అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అవే ఆయన చివరి మాటలు. 

Follow Us:
Download App:
  • android
  • ios