పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శిరోమణి అకాలీదళ్(shiromani Akalidal) సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా(Bikram Singh Majithia) అధికార కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ(Siddharth Chattopadhyay)కు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శిరోమణి అకాలీదళ్(shiromani Akalidal) సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా(Bikram Singh Majithia) అధికార కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress) రాజ్యాంగాన్ని గౌరవించమని మాట్లాడుతుందని, అయితే గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ED ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖ్‌పాల్ ఖైరాకు డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని బిక్రం ఆరోపించారు. అయితే, వారెంట్ ఉన్నప్పటికీ, అతనిపై పంజాబ్ పోలీసులు చర్యలు తీసుకోలేదని మజిథియా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ(Siddharth Chattopadhyay)కు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

డీజీపీ ప్రమేయంపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరగాలని బిక్రం డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ, గ్యాంగ్‌స్టర్ కాల్ రికార్డింగ్‌ను ప్రస్తావిస్తూ.. ప్రధాని పర్యటనకు కొద్ది రోజుల ముందు ఓ గ్యాంగ్‌స్టర్‌తో డీజీపీ మాట్లాడుతూ.. మరో మూడు నాలుగు రోజుల్లో మోడీకి కూడా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారని బిక్రమ్ అన్నారు. ప్రధాని మోడీ భద్రతను ఉల్లంఘించిన సమయంలో సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ పంజాబ్ తాత్కాలిక డీజీపీగా ఉన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. ఆయుధ చట్టంలో సిద్ధూ ముసేవాలాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

కాగా...పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 5న భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్‌ పోలీసులకు అందించారు. 

దీనిపై స్పందించిన పంజాబ్ డీజీపీ.. రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని భటిండా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో గానీ 100 మంది రైతులు ఆ రహదారిని దిగ్బంధించారు. దీంతో కారులోనే ప్రధాని కాసేపు వేచిచూశారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ చేరుకున్నారు.