ఓ ద్విచక్రదారుడి ట్రాఫిక్ చలాన్లను చూసి పోలీసులే షాక్ అయ్యాడు. అతడి వాహనం పై  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఆ 40 పెండింగ్ విలువ తెలిస్తే.. దిమ్మతిరగాల్సిందే.. 

దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకవచ్చాయి. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

ఈ మేరకు బైక్ పై ఇద్దరూ మాత్రమే ప్రయాణించాలి. ప్రయాణించేటప్పుడూ ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి. అదేవిధంగా కార్లలో ప్రయాణించేటప్పుడూ తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ ను తప్పనిసరిగా పాటించాలంటూ ఎన్నో నియమాలను పెట్టాయి. అలా కాదని ఆ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు వాహనాదారుడి జోబులకు చిల్లు పడాల్సిందే. భారీ మొత్తంలో జరిమానాలు కట్టాల్సిందే. 

అలా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన ఓ వ్యక్తిని బెంగుళూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో అతగాడి చలాన్ల చిట్టాను చూసి.. పోలీసులే అవాక్కయ్యారు. అతడి వాహనంపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ చలాన్ల మొత్తం దాదాపు రూ. 12 వేలు దాటింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకున్నది. 

వివరాల్లోకెళ్తే..బెంగుళూర్ లోని తాళ్లగట్ట పోలీస్‌ పరిధిలో శనివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఓ ద్విచక్రదారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి చలాన్ల చిట్టాను పరిశీలించి.. పోలీసులే షాకయ్యారు. అతడిపై 40 చలాన్లను చెల్లించాల్సింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో చలాన్లను పోలీసులు అక్కడికక్కడే అతని నుండి వసూలు చేశారు. ఈ మొత్తం 40 పెండింగ్ కేసుల్లో అతడు ₹ 12000 చెల్లించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోలీసులు ట్విట్టర్ లో పంచుకున్నారు. చలాన్లు ఉల్లంఘించిన వ్యక్తి తన పొడవైన ట్రాఫిక్ చలాన్‌ చిట్టాను చూపిస్తూ ఫోటోకు పోజులివ్వడం చూడవచ్చు. ఈ ట్వీట్ కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. 

ఓ వినియోగదారు ఇలా వ్రాశాడు. "నువ్వు సూపర్ బ్రో.. ట్రాఫిక్ గా కింగ్ అంటూ కామెంట్ చేశాడు. మరికొందరు X వినియోగదారులు.. పునరావృతమయ్యే నేరాలకు, వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సూచించారు. ఇంకో వినియోగదారుడు.. "తక్షణమే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయమని RTOకి సిఫార్సు చేయండి. అతనికి కౌన్సెలింగ్ అవసరం. లేదంటే వచ్చే ఏడాది కూడా అతడు ఇలా మరో ఫొటో పోస్ట్ చేస్తాడు అంటూ కామెంట్ చేశాడు.