సినిమా తరహా ట్విస్ట్.. భార్య ప్రేమను అర్థం చేసుకుని భర్త ఏం చేశాడంటే..?
Deoria: సాధారణంగా సినిమాల్లో కనిపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తన భార్య ప్రేమను అర్థం చేసుకున్న భర్త.. ఆమెను కలవడానికి వచ్చిన ప్రియుడితో పంపించాడు. రాష్ట్రంలోని దేవరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Deoria: సాధారణంగా సినిమాల్లో కనిపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తన భార్య ప్రేమను అర్థం చేసుకున్న భర్త.. ఆమెను కలవడానికి వచ్చిన ప్రియుడితో వివాహం జరిపించి పంపించాడు. రాష్ట్రంలోని దేవరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. దేవరియా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు. అయితే, ఇటీవలే ఆమెకు మరోవ్యక్తితో వివాహం జరిగింది. భార్య తన ప్రియుడిని కలిసిన విషయం తెలిసిన భర్త.. ఆమె ప్రేమ విషయం అర్థం చేసుకునీ, వారిద్దరికి వివాహం జరిపించాడు. బరియార్‌పుర్ నగర్ పంచాయతీలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక యువతితో ఈ ప్రాంతానికి చెందిన యువకునికి పెండ్లి జరిగింది. పెండ్లి జరిగినప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా వీరి సంసారం కొనసాగింది. అయితే, ఉన్నట్టుండి ఆమె ప్రేమికుడు వారింటికి రావడం.. వీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని పేర్కొంటూ స్థానికులు చితకబాదారు. ఆమె ప్రేమ గురించి భర్తకు ఇంతకుముందే చెప్పిందని సమాచారం. ఇప్పుడు ఆమె ప్రియుడు ఇంటికి రావడంతో.. భార్య ప్రేమను గుర్తించి.. లవర్ తో వివాహం జరిపించాడు భర్త. వారిద్దరిని కలిపి పంపించాడు. దీనికి సంబంధించి వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.