బాలికపై మహిళా టీచర్ల లైంగిక దాడి.. అరెస్ట్

Bihar: Two woman teachers convicted of sexual assault on 5 year old girl
Highlights

ఓ ఐదేళ్ల బాలికపై ఇద్దరు మహిళా టీచర్లు చేసిన అసహజ లైంగిక చర్యల కేసులో పట్నా కోర్టు స్పందించింది. చిన్నారితో టీచర్లు తమ లైంగిక కార్యకలాపాలు కొనసాగించారని పోలీసులు కోర్టుకు విన్నవించారు.

 ఆడపిల్లలకు పురుషుల వద్ద మాత్రమే కాదు.. మహిళల వద్ద కూడా  రక్షణ లేకుండా పోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. తల్లిలాగా ఆదరించాల్సిన ఇద్దరు మహిళా టీచర్లు.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినికి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు స్కూలు హెడ్‌ మాస్టర్‌ సైతం మొత్తం 18 మంది 7 నెలలపాటు నరకం చూపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ క్రమంలో ఏడాదిన్నర కిందట ఓ ఐదేళ్ల బాలికపై ఇద్దరు మహిళా టీచర్లు చేసిన అసహజ లైంగిక చర్యల కేసులో పట్నా కోర్టు స్పందించింది. చిన్నారితో టీచర్లు తమ లైంగిక కార్యకలాపాలు కొనసాగించారని పోలీసులు కోర్టుకు విన్నవించారు.

నుతన​ జోసెఫ్‌, ఇందూ ఆనంద్‌ అనే మహిళా టీచర్లు ఓ తెలుగు మీడియం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 2016 నవంబర్‌ నెలలో ఈ టీచర్లు స్కూలు వేళలు ముగిశాక ఓ ఐదేళ్ల బాలిక దుస్తులు విప్పి వికృతచర్యలకు పాల్పడ్డారు. కొన్నిరోజుల తర్వాత టీచర్లు ఏదో చేస్తున్నారని ఇంట్లో చెప్పగా.. ఆగ్రహావేశాలకు లోనైన విద్యార్థిని తల్లిదండ్రులు మహిళా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతంలోనే బాలికను మెడికల్‌ టెస్ట్‌ల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆపై మెడికల్‌ రిపోర్టులలో బాలికపై లైంగిక చర్యలు నిజమేనని తేలింది. వాయిదాల అనంతరం తాజాగా కేసు విచారణ జరిపిన జడ్జీ జస్టిస్‌ రవీంద్రనాథ్‌ త్రిపాఠి ఈ జూలై 20న మహిళా టీచర్లకు శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

loader