బిహార్‌లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతుండగా టెర్రస్ పై నుంచి వీడియో తీసిన బీఈడీ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. ఘర్షణలకు పాల్పడుతున్న వారి వద్ద గన్‌లు ఉన్నాయి. అందులో కొందరు ట్రిగ్గర్ నొక్కడంతో ఓ బుల్లెట్ ఆ స్టూడెంట్‌ను గాయపరిచింది. 

న్యూఢిల్లీ: బిహార్‌లోని భగల్‌పూర్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు గ్రూపులు రోడ్డుపై ఘర్షణకు దిగాయి. అందులో కొందరు గన్‌లు పట్టుకుని ఉన్నారు. ఒకరిపైకి ఒకరు గన్‌లు ఎక్కుపెట్టుకుంటూ బెదిరించుకున్నారు. ఈ ఘర్షణ ఇంటి ముందే జరుగుతుండటంతో ఆ విద్యార్థి టెర్రస్ మీదికి వెళ్లి వీడియో తీయడం మొదలు పెట్టాడు. ఇంతలో ఆ గుంపులో నుంచి ఒకరు గన్ ఫైర్ చేశారు. ఆ బుల్లెట్ నేరుగా వీడియో తీస్తున్న స్టూడెంట్‌కు తగిలింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆ స్టూడెంట్ మరణించాడు.

భగల్‌పూర్ నౌగాచియాలో స్థానిక కార్పరేటర్ల రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణ ఆశిశ్ ఇంటి ముందే జరుగుతున్నది. ఆశిశ్, అతని సోదరుడు సచిన్‌లు ఇద్దరూ టెర్రస్ పైకి వెళ్లారు. ఆ ఇన్సిడెంట్ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఘర్షణలో ఉన్న ఓ వ్యక్తి గన్ ఫైర్ చేయడంతో ఆ బుల్లెట్ ఆశిశ్‌కు తగిలింది. ఆశిశ్ బీఈడీ స్టూడెంట్. ఓ టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆశిశ్ తండ్రి ప్రదీప్ పండిత్‌కు నౌగాచియాలో ఓ హార్డ్‌వేర్ షాప్ ఉన్నది.

Also Read: జమ్ము కశ్మీర్‌లో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా.. పతాకాన్ని ఆవిష్కరించిన ఆర్మీ

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం, వార్డ్ నెంబర్ 10 కౌన్సిలర్ మనీశ్ సింగ్ సోదరుడు లాల్ సింగ్‌తో నౌగాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతికుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆయన సోదరుడు పప్పు యాదవ్, ఇతరులు ఘర్షణ పడుతున్నారు. కౌన్సిలర్ మనీశ్ కూడా అక్కడ ఉన్నాడు. ఆ గొడవను సర్దిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 

Scroll to load tweet…

ఆ గొడవ జరుగుతుండగానే డబ్ల్యూ యాదవ్, ఆయన వెంట వచ్చిన వారు ఫైరింగ్ చేయడం ప్రారంభించారు. వారు ఫైర్ చేయడంతో అక్కడే టెర్రస్ పై నుంచి వీడియో తీస్తున్న ఆశిశ్‌కు తగిలింది.

ఈ మొత్తం ఘటన ఆశిశ్‌కు బుల్లెట్ తగిలే వరకు వీడియో రికార్డ్ అయింది. పోలీసులు ఈ ఘటనలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దోషులను వదిలిపెట్టబోమని పోలీసులు తెలిపారు. నిందితులను గాలిస్తున్నట్టు చెప్పారు.