బీహార్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి వృద్ధ దంపతులను హత్య చేసి.. వారి మృతదేహాలను సమీపంలోని చెత్త కుప్పలో పడవేసే ముందు జాతీయ రహదారి వెంట దాదాపు 500 మీటర్ల వరకు లాగాడు. భాగల్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

బీహార్ లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భాగల్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి వృద్ధ దంపతులను అంతమొందించాడు. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలను చెత్త కుప్పలో పడవేసేందుకు జాతీయ రహదారి వెంట దాదాపు 500 మీటర్ల వరకు లాగాడు. ఆ నిందితుడ్ని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నివాసి మహ్మద్ ఆజాద్‌గా గుర్తించారు. 

ఈ ఘటనపై భాగల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రంజన్ మాట్లాడుతూ..మహ్మద్ ఆజాద్‌ అనే నిందితుడు వృద్ధ దంపతులను రాడ్ ,ఇటుకలతో కొట్టి హత్య చేశాడు. ఆ నిందితుడు అంతటితో ఆగకుండా.. వారి మృతదేహాలను జాతీయ రహదారిపై దాదాపు 500 మీటర్ల వరకు లాగి చెత్తలో పడేశాడు. నిందితుడిని ఫతేపూర్ నివాసి మహ్మద్ ఆజాద్‌గా గుర్తించినట్టు తెలిపారు.

సంఘటన తర్వాత పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మృతదేహాలను నడిరోడ్డుపై లాగుతున్నట్టు అక్కడి సిసిటివిలో రికార్డు అయ్యింది. నిందితుడు మానసిక వికలాంగుడు అని, అతని మానసిక స్థితి సరిగా లేదని ఎస్పీ తెలిపారు. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంతో నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 

అధికారులు మరింత సమాచారం సేకరించడం , సాక్ష్యాలను పరిశీలించడం కొనసాగిస్తున్నప్పటికీ.. ఈ భయంకరమైన ఘటన వెనుక అసలు ఉద్దేశ్యం, పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సంఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.