బీహార్ లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యతో పారిపోయిన వ్యక్తి భార్యను పెళ్ళిచేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

బీహార్ : బీహార్ లో ఓ వింత ఘటన ఇప్పుడు విన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ వ్యక్తి భార్యను మరో వ్యక్తి తీసుకెళ్లాడు…భార్య వెళ్ళిపోయిన వ్యక్తి.. తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకున్నాడు.. కాస్త కన్ఫ్యూజన్ గా ఉందా? మొదటిసారి విన్న వారందరికీ ఇది అలాగే అనిపిస్తుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తి భార్యతో పరారయ్యాడు. దీంతో సదరు వ్యక్తి బాధితుడు భార్యను వివాహం చేసుకున్నాడు. ఈ వింత ఘటన బీహార్ లోని ఖగాడియా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చౌథామ్ బ్లాక్ లోని హార్డియా గ్రామ నివాసి ముఖేష్. ఆయన నీరజ్ అనే వ్యక్తి భార్యతో పారిపోయాడు. 

దీంతో ముఖేష్ భార్యను నీరజ్ గుడిలో వివాహం చేసుకున్నాడు. పారిపోయిన మహిళ, బాధితురాలైన మహిళ ఇద్దరి పేర్లు రూబీనే. అంతేకాదు నీరజ్ కు పారిపోయిన రూబీతో నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… ముఖేష్ తో వెళ్లిపోయిన నీరజ్ భార్య రూబీకి… ముఖేష్ తో పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. ముఖేష్ నీరజ్ భార్య రూబీ పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అదే సంబంధం కొనసాగింది. ముఖేష్ కు కూడా పెళ్లయింది. కానీ, నిరుడు ఫిబ్రవరిలో ముఖేష్ తన మొదటి ప్రియురాలు రూబీని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడు.

ప్రీతి మృతికి రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా కారణమేనా? వెలుగులోకి కొత్త ట్విస్ట్.. చివరిమాటల్లో ఏముంది??

ఆ తరువాత నీరజ్ తో కలిగిన నలుగురు సంతానంలో.. ముగ్గురిని తీసుకుని ముఖేష్ తో పాటు రూబీ గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయం రూబీ భర్త నీరజ్ కు తెలిసింది. తన భార్య రూబీ ముఖేష్ అనే వ్యక్తితో వెళ్లిపోయిందని పస్రాహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామ పెద్దలకు విషయం చేరింది. దీనిమీద వారు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీకి హాజరైన ముఖేష్.. ప్రియురాలైన రూబీని వదలడానికి ఇష్టపడలేదు. దీంతో నీరజ్ ముఖేష్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముఖేష్ మొదటి భార్య అయిన రూబీతో నీరజ్ పరిచయం పెంచుకున్నాడు.

అది కాస్తా వారిద్దరి మధ్య ఒక అవగాహనకు వచ్చి పెళ్లి చేసుకోవాలనుకునే దాకా వెళ్ళింది. అలా ఫిబ్రవరి 18న స్థానికంగా ఉన్న ఆలయంలో నీరజ్, ముఖేష్ మొదటి భార్య రూబీని వివాహం చేసుకున్నాడు. ముఖేష్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. నీరజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.