నిమజ్జనం ఊరేగింపులో గన్ ఫైరింగ్.. ఒకరి దుర్మరణం.. బిహార్‌లో ఘటన
సరస్వతీ దేవి ఊరేగింపులో ఓ వ్యక్తి సెలెబ్రేటరీ ఫైరింగ్ కాల్చాడు. ఆ బుల్లెట్ గాయాలతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన పాట్నాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

పాట్నా: బిహార్‌లో ఓ విషాద ఘటన చోటచేసుకుంది. సరస్వతి దేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చేపడుతున్న ఊరేగింపులో వేడుకగా ఓ వ్యక్తి గన్ తీసి ఫైర్ చేశాడు. ప్రమాద వశాత్తు ఆ బుల్లెట్ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన బిహార్‌లోని పాట్నాలో పోలీసు హెడ్ క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
మృతుడిని ధీరజ్‌గా గుర్తించారు. సరస్వతీ దేవి విగ్రహం నిమజ్జనం చేయడానికి ధీరజ్, మరికొందరు స్టూడెంట్లు (ఇందులో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన వారూ ఉన్నారు) గంగా నది వైపు వెళ్లుతున్నారు. సరస్వతీ దేవి విగ్రహ నిమజ్జనం చూసి తరించాలని వారంతా కీకలు వేస్తూ వెళ్లారు. ధీరజ్ జెహెనాబాద్‌కు చెందిన వాడని తెలుస్తున్నది.
Also Read: కట్నం కోసం భార్యను సజీవ దహనం చేసిన మాజీ ఫైర్ మ్యాన్ ఆఫీసర్.. కోర్టు తీర్పు ఇదే
దేవీ ఊరేగింపు ఉత్సవాల్లో భాగంగా ఓ వ్యక్తి అందులో నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం, క్షతగాత్రుడిని ఓ హాస్పిటల్‌కు పరుగున తీసుకెళ్లారు. అక్కడే పరిస్థితులు విషమించి మరణించాడు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపులు జరుపుతను్నట్టు పోలీసులు వివరించారు.