Asianet News TeluguAsianet News Telugu

బావిలో దూకినా.. గర్ల్‌ఫ్రెండ్ అయితే దక్కింది.. ఆమెతోనే పెళ్లి చేసిన ఊరిపెద్దలు.. లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్

బిహార్‌లో ఓ యువకుడు అర్ధరాత్రి తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులు మేలుకోవడంతో ఆ యువకుడు పరుగుతీశాడు. కుటుంబ సభ్యులు వెంబడించడంతో సమీపంలోని బావిలో దూకేశాడు. అతడిని బయటకు తీసే కాలంలో ఘటన గురించి ఊరంతా తెలిసింది. చివరకు ఆ ఇద్దరికే పెళ్లి చేసేయాలని ఊరిపెద్దలు నిర్ణయించి, కుటుంబ సభ్యులను ఒప్పించారు.
 

bihar lover jumps into after girlfriends family chase gets married next day
Author
First Published Dec 13, 2022, 6:59 PM IST

పాట్నా: బిహార్‌కు చెందిన ఓ యువకుడు తన గ్రామానికే చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ కొన్నాళ్లుగా గుట్టుగా ప్రేమ కథ నడిపిస్తున్నారు. రాత్రిపూట రహస్యంగా ఇంటిలోనే కలిసే వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. ఓ రోజు రాత్రి ప్రేయసి గదికి అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్లాడు. కానీ, అదే రోజు రాత్రి కొన్ని చప్పుళ్లు విన్న కుటుంబ సభ్యులు మేలుకున్నారు. ఇది గమనించిన ప్రియుడు పరుగు లంకించుకున్నాడు. అతడిని ఛేజ్ చేయడానికి ప్రేయసి కుటుంబ సభ్యులు వెంటే పరుగు పెట్టారు. వారి చేత చిక్కవద్దని భావించిన ఆ యువకుడు పరుగెడుతూనే ఎదురుగా కనిపించిన ఓ బావిలో దూకేశాడు.

చాప్రాలోని మోతిరాజ్‌పూర్ గ్రామానికి చెందిన మున్నా రాజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి శనివారం రాత్రి 2 గంటలు దాటిన తర్వాత వెళ్లాడు. ప్రేయసి కుటుంబ సభ్యులు మేలుకోవడంతో మున్నారాజ్ ఇల్లు వదిలి పరుగు తీశాడు. కానీ, ఆ కుటుంబ సభ్యులు అతడిని వదిలిపెట్టలేదు. అతడి వెంటే పరుగు తీయడంతో ప్రాణాలు రక్షించుకోవడానికి మున్నా రాజ్ బావిలో దూకాడు.

Also Read: పెళ్లి వేడుకలో ఫొటోల కోసం గొడవ.. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో బంధువుల చికిత్స

ఆ వెంటే ప్రేయసి కుటుంబ సభ్యులు, ఇతర గ్రామస్తులు కూడా ఆ బావి చుట్టూ చేరారు. ఆ యువకుడిని సురక్షితంగా బావిలో నుంచి బయటకు తీశారు. అతడిని బయటకు తీసిన తర్వాత మెల్లగా ఘటన గురించి ఊరంతా పాకింది. 

వారి రహస్య ప్రేమాయణం కాస్తా ఊరంతా టముకు వేసినట్టయింది. ఈ క్రమంలోనే ఆ ఊరి పంచాయతీ పెద్దలు, స్థానికులు.. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చారు. ఆ కుటుంబం అంగీకారంతోనే ఆ జంటకు పెళ్లి చేశారు. గ్రామంలోని ఓ దేవాలయంలో వివాహం జరిపించేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బావిలో దూకనైతే దూకేశాడు.. ప్రేయసిని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడని అంతా చర్చించుకున్నారు. బావిలో దూకిన మరుసటి రోజే అతని పెళ్లి జరిపించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios